మన స్టార్ హీరోలు అప్పుడప్పుడు మనసున్న పనులు చేసి అభిమానులను సంతోష పెడుతూ ఉంటారు.వారి చేసే పని చిన్నదే అయినా కూడా.
ఆ చిన్న పనే మరింత ఆనందం ఇస్తుంది.మరి తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఒక చిన్నారి అభిమాని కోసం చిన్న పని చేసి అతడిని సంతోష పెట్టాడు.
మరి ఇంతకీ ఈ మెగా హీరో చేసిన పని ఏంటంటే.
రామ్ చరణ్ చిన్నారి అభిమానిని కలిసాడు.
ఈ 9 ఏళ్ల బాలుడు ప్రస్తుతం క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు.ఈ బాబును రామ్ చరణ్ కలిశారు.
కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఈ బాలుడి కోరిక మేరకు ఈ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న చరణ్ బాలుడిని కలిసి పరామర్శించి కొద్దిసేపు మాట్లాడారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రెజెంట్ భారీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.మావెరిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ తో చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాడు.రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15‘.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.
ఈ సినిమా అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక చరణ్ ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.