మళ్లీ తెరపైకి విశాల్ మ్యారేజ్ న్యూస్.. ప్రేమలో ఉన్నానంటూ హీరో కామెంట్స్!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమిళ హీరో అయినా విశాల్ తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Vishal Reveals He Is Already In Love Details, Vishal, Kollywood, Love Marriage,-TeluguStop.com

కాగా తెలుగులో అభిమన్యుడు, ఇంద్రుడు యాక్షన్, పందెంకోడి, భరణి, అయోగ్య, ప్రేమ చదరంగం లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు హీరో విశాల్.కాగా హీరో విశాల్ సినిమాలలోని కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండటం కోసం యాక్షన్ సీన్లలో డూప్ లేకుండా నటిస్తూ ఉంటాడు.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలాసార్లు గాయపడిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ సన్నివేశాలలో డూప్ లేకుండా చేయాలి అని రిస్క్ చేస్తూ కష్టపడుతూనే ఉంటాడు.

విశాల్ ఇటీవలే లాఠీ సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే.ఆ గాయాల నుంచి విశాల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడట.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు పెద్దలు కుదిర్చిన సంబంధాలు తనకు అచ్చిరావని, కాబట్టి లవ్‌ మ్యారేజే చేసుకుంటానని తెలిపాడు.అంతేకాకుండా,ప్రస్తుతం తాను ఒక అమ్మాయితో ప్రేమలో కూడా ఉన్నానని, త్వరలోనే ఆమె ఎవరనే విషయాన్ని బయటపెడతాను అని తెలిపాడు విశాల్.

Telugu Aneesha Alla, Anisha Alla, Vishal, Kollywood, Latthi, Love-Movie

మరి విశాల్ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ఎవరో తెలియని అంటే వీరు చూడాల్సిందే మరి.ఇకపోతే విశాల్‌కు 2019లో నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.అయితే ఇక వారు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునేలోపు వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.ఆ తర్వాత విశాల్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో లవ్‌లో ఉన్నాడంటూ రూమర్స్ వినిపించినప్పటికీ ఆ విషయంపై అటు శరత్ కుమార్ కానీ, ఇటు విశాల్ గాని స్పందించకపోవడంతో ఆ వార్త కేవలం రూమర్ గానే మిగిలిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube