ప్రతి అమ్మాయి అందమైన మెరిసే ముఖం కావాలని కోరుకుంటుంది.ముఖంపై ఎటువంటి మచ్చలు,ముడతలు లేకుండా ఉండాలని ఎన్నో సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.
వాటి వల్ల పెద్దగా ఉపయోగం కనపడదు.అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
అందువల్ల మన ఇంటిలో సహజసిద్ధంగా లభించే వేపతో
చర్మ సంరక్షణ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
వేపాకును మెత్తని పేస్ట్ గా చేసి దానిలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాశి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెండు
రోజులు చేస్తే ముఖ ఛాయ మెరుగు అవ్వటమే కాకుండా మొటిమల సమస్య కూడా
తగ్గిపోతుంది.

వేపాకులను పేస్ట్ చేసి కొంచెం ముల్టానా మట్టి,రోజ్ వాటర్ కలిపి ముఖానికి
పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.వేపలో ఉండే
లక్షణాలు చర్మంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని మృదువుగా,
ఆరోగ్యంగా మారుస్తాయి.ముల్తానా మట్టి చర్మంపై అధికంగా పేరుకున్న
జిడ్డును తొలగిస్తుంది.
వేపాకు పేస్ట్ లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి.పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండ చేస్తూ ఉంటే తొందరగా మొటిమల సమస్య తగ్గిపోతుంది.నిమ్మలో ఉండే సహజమైన యాస్ట్రిజంట్ గుణాలు మొటిమలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.