ఇండియన్ కూల్ కెప్టెన్ ధోని (MS Dhoni).ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ స్థాపించి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈయన నిర్మాణ సంస్థలు తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే ఒక తమిళ సినిమాని నిర్మించారు.ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్లో ధోని వైఫ్ సాక్షి(Dhoni Wife Sakshi).ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే సాక్షి సింగ్ ను ప్రశ్నిస్తూ… మీరు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రభాస్(Prabhas) వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సాక్షి సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి వారందరూ కూడా స్టార్ హీరోస్.
వారికి రెమ్యూనరేషన్(Remuneration) ఇచ్చే అంత మని తన దగ్గర లేదని తెలిపారు.

తాను ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నానని అందుకే ఇప్పుడే అలాంటి స్టార్స్ తో సినిమా చేసే ఆలోచనలో లేనని తెలిపారు.ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా ధోని హీరోగా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అని కూడా ఈమెను ప్రశ్నించారు అయితే తాను కూడా ఆరోజు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.కథ అన్ని కుదిరితే తోని హీరోగా సినిమా రావచ్చు అని ఈ సందర్భంగా ఈమె చెప్పకనే చెప్పేశారు.
ఈ విధంగా సాక్షి సింగ్ ఈ LGM సినిమాని ప్రమోట్ చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.