వివో వాచ్-2 కు అప్డేట్ మోడల్ గా వివో వాచ్-3( Vivo Watch-3 ) మైమరిపించే ఫీచర్లతో, 16 రోజుల బ్యాటరీ లైఫ్ తో మార్కెట్లోకి లాంచ్ అయింది.ఈ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధర వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.
ఈ వివో వాచ్-3 స్మార్ట్ వాచ్ 1.43 అంగుళాల రౌండ్ డిస్ ప్లే తో ఉంటుంది.వివో బ్లూఓఏస్, వాయిస్ కాల్స్ కోసం ప్రత్యేకంగా ఈ-సిమ్, కలర్, స్ట్రాప్ లాంటి పలు ఆప్షన్లతో ఉంటుంది.చైనాలో( China ) లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా భారత మార్కెట్లోకి లాంచ్ అవలేదు.
స్మార్ట్ వాచ్ కంపెనీ భారత్ లో ఈ స్మార్ట్ వాచ్ లాంచ్ పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఈ వాచ్ లో ఉండే మిగతా స్పెసిఫికేషను వివరాల విషయానికి వస్తే.థిన్నర్, స్టైలిష్ డిజైన్ తో సులభంగా వాడుకునేందుకు స్టెయిన్ లెస్ స్టీల్ రొటేటింగ్ క్రౌన్, కుడివైపున బటన్ తో పాటు కర్వ్డ్ గ్లాస్ తో 3డీ ఎఫెక్ట్ ను మైమరిపించేలా ఉంటుంది.స్లీప్, స్ట్రెస్ లెవెల్స్ ట్రాక్స్ లాంటి హెల్త్ ఫీచర్లతో ఉంటుంది.
మిగతా స్మార్ట్ వాచ్ లలో మాదిరిగానే హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ2 సెన్సర్( Heart rate monitor, SPO2 sensor ), అసాధారణ ఫ్లక్చువేషన్స్ లో యూజర్లను అలర్ట్ చేసే ఫీచర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ వాచ్ 505 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి, 16 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.స్టార్ లైట్, బ్రైట్ మూన్, మూన్ లైట్ వైట్ అనే మూడు రకాల రంగులలో లభిస్తుంది.మన భారత కరెన్సీలో ఈ వివో వాచ్-3 ధర దాదాపుగా రూ.15 వేలకు పైగా ఉంటుంది.భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఈ వాచ్ ధరపై పూర్తి స్పష్టత వస్తుంది.