ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పెంచుకునే పెంపుడు జంతువులలో పిల్లులు ఒకటి.ఈ క్యాట్స్ చాలా స్మార్ట్.
అలానే ఇవి దర్జాగా బతుకుతాయి.దర్జాగా పడుకుంటాయి.
అలాగే కూర్చుంటాయి.కాగా తాజాగా ఒక పిల్లి మనిషి వలె కూర్చొని ఆశ్చర్యపరుస్తోంది.
ప్రముఖ ట్విట్టర్ పేజీ @Buitengebieden ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.65 వేల వరకు లైకులు వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి తలుపు ముందు దర్వాజపై కూర్చుని ఉండటం కనిపించింది.
ఆ పిల్లి గడపపై మామూలుగా కూర్చుని ఆ తర్వాత తన ముందర కాళ్లను గడప పై ఉంచి.వెనక కాళ్లను కిందకి దించింది.అంటే మనిషి లాగా గడప పైన తన వెనక భాగం ఉంచి కాళ్లను కిందన పెట్టుకొని, పైన తన ముందు కాళ్లను పెట్టుకుంది.అలా చాలాసేపు కూర్చుని తన రాజసాన్ని అది ప్రదర్శించింది.
ఈ దృశ్యం చూసేందుకు చాలా అద్భుతంగా అనిపించింది.
ఈ వీడియో చూసిన తరువాత “వావ్, ఈ పిల్లి మామూలుది కాదు.అచ్చం మనుషుల్లాగానే కూర్చుంటుందిగా” అని నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.మనిషిలాగా కూర్చున్న ఈ పిల్లి మనిషి వలె ఏవైనా మాట్లాడుతుందా లేక ఒక సలహా ఇస్తుందా ఏంటీ అని ఇంకొక యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు.
మిగతా చాలామంది దీన్ని చూసి బాగా నవ్వుకుంటున్నారు.ఈ క్యూట్ క్యాట్ వీడియోని మీరు కూడా తిలకించండి.