ఇకపై అతి సులువుగా ఆధార్ లో ఉన్న ఇంటి నెంబర్ మార్పు.. ఎలా అంటే..?!

మీలో ఎవరైనా కొత్త ఇంటికి మారారా.? మీ ఆధార్ కార్డు పై ఉన్న ఇంటి నెంబర్,  ఇంటి అడ్రస్ ను మార్పు చేసుకోవాలని అనుకుంటున్నారా… ఐతే మీకు ఒక శుభవార్త .ఇకపై ఏ అడ్రస్ ప్రూఫ్ లేకుండా గానే ఆధార్ కార్డు పై ఉన్న అడ్రస్ ను సులువుగా మార్చుకోవచ్చని యూఐడీఏఐ తెలియచేసింది.

 Now It Is Very Easy To Change The House Number In Aadhaar How Is That, Adhar, Ui-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… కేవలం ఆన్లైన్ ద్వారానే అడ్రస్‌ వాలిడేషన్‌ లెటర్‌  ద్వారా ఇంటి అడ్రస్ తదితర వివరాలను మార్పు చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలియజేసింది .ఇక అడ్రస్ మార్పు చేసుకోవడానికి ఇంటి యజమాని అయినా సరే, వారి ఇంట్లో కుటుంబ సభ్యులలో ఎవరైనా అయినా సరే అడ్రస్ వాలిడేషన్ లెటర్ ను ఆన్లైన్ ద్వారా సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇందుకు కావాల్సిందంతా ఒక్కటే ఇంటి యజమాని యొక్క ఫోన్ నెంబర్.

అడ్రస్ మార్పు కోసం యజమాని ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు కు లింక్ అయి ఉంటే చాలు.

ఇందుకు ముందుగా //http//uidai.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలి.అందులో  ‘my address’ మెను లోని ‘address validation’ ఆప్షన్ పై  క్లిక్‌ ఉంటుంది.అప్పుడు అడ్రస్‌ వాలిడేషన్‌ లెటర్ లో 12 అంకెల ఆధార్ సంఖ్య లేదా 16 డిజిటల్ వర్చువల్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఎంటర్ చేసిన వెంటనే ఓటిపి సెండ్ చేయమని ఒక ఆప్షన్ ఉంటుంది.

ఆధార్ కార్డు లింక్ అయిన ఇంటి యజమాని వ్యక్తి ఫోన్ నెంబర్ కు ఓటిపి వచ్చాక, ఎంట్రీ చేసి పూర్తి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.ఇక చివరిగా అడ్రస్ కోసం ఇంటి ఓనర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ వస్తుంది.

దాన్ని వెరిఫై చేసిన తర్వాత మరోసారి ఓటిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే చివరిగా సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ మనకు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది.

ఇలా అంతా కాకుండా ఎవరికైతే ఇలా చేయడం కష్టంగా ఉంటుందో వారు నేరుగా ఆధార్ కార్డ్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి మీ అడ్రస్ కి సంబంధించి ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఒకటి వారికి అందజేస్తే మీ అడ్రస్ సులువుగా మార్చుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube