జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కాస్త ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తున్నారు.టిడిపితో జనసేన పొత్తు విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో సరైనదే అయినా.
కొన్ని కొన్ని విషయాల్లో జనసేన పై ఆ పొత్తు ప్రభావం తీవ్రంగా చూపిస్తుండడంతో, అంతిమంగా పార్టీకి నష్టమే జరిగే అవకాశం ఉండడంపై జనసైనికులలోనూ ఆవేదన కనిపిస్తోంది.టిడిపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా, రెండు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు ఇచ్చే పదవుల విషయంలో సరైన క్లారిటీ లేదు.
దానిపై సరైన క్లారిటీ టిడిపి నుంచి తీసుకోకుండానే పవన్ పొత్తు పెట్టుకోవడం, టిడిపి జనసేన కూటమి గెలిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో, జనసైనికుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ప్రస్తుతం జనసేన ఉన్న పరిస్థితుల్లో టిడిపి తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడం మినహా మరో ఆప్షన్ లేదనే విషయాలనే పవన్ గ్రహించడంతోనే షరతులు లేకుండానే, టిడిపితో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు .పవన్ లో ఈ బలహీనతను గుర్తించే టిడిపి మరింతగా చెలరేగిపోతుంది అనే అభిప్రాయాలు జనసేన నాయకుల్లో ప్రస్తుతం నెలకొంది.జనసేన ను పూర్తిగా తెలుగుదేశం చేతులు పెట్టడం ద్వారా , రేపు రెండు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చినా, జనసేనకు పదవుల్లో పెద్దగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం లేదనే అభప్రాయాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
నెలకొన్న పరిణామాలపై సీనియర్ పార్లమెంటేరియన్, మాజీ కేంద్రమంత్రి చేకొండి హరి రామ జోగయ్య( Chegondi harirama jogayya ) స్పందించారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ నూ ప్రశ్నిస్తూ లేఖ రాశారు .

అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని, ఆయన పరోక్షంగా పవన్ కు హేతువు పలికారు.అయితే పవన్ ( Pawan Kalyan )నుంచి సమాధానం రాలేదు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే అంత స్థాయిలో బలోపేతం కాలేదనే విషయం పవన్ కు అర్థమయ్యే టిడిపి తో పొత్తు విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.కాకపోతే పదవులు ప్రాధాన్యం విషయంలో పవన్ రాజీ పడితే అది అంతిమంగా జనసేనకు రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిణామాలు తీసుకువచ్చే పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడం ఒక్కటే లక్ష్యం తప్ప, జనసేనకు పదవులు, ప్రాధాన్యం విషయంలో పవన్ పెద్దగా దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.