వినూత్న ప్రయోగం : ఇక నుంచి కూరగాయలు ఇంటి వద్దకు...

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగా ఎంత ఖర్చు పెట్టడానికి అయినా ప్రభుత్వం వెనకాడడం లేదు.

 Government Yet Decided To Supply Vegetables Home Delivery, Vegetables Home Deliv-TeluguStop.com

అయితే జనతా కర్ఫ్యూ పాటించిన అనంతరం ఉన్నట్లుండి లాక్ డౌన్ ప్రకటించడంతో సామాన్య ప్రజలు నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఒక పక్క బయటకు వస్తారేమో పోలీసుల చేతిలో తన్నులు తినలేక, పస్తులు ఉండలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర కూరగాయలను తమ ఇళ్ల వద్దకే అందించేందుకు యత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఈరోజు నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని వాహనాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రయోగాన్ని పరీక్షించనున్నారు.

ఇందులో కూరగాయలు మరియు పాలు వంటివి లభ్యమవుతాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే వాహనదారులు కూరగాయలను తమ ఇంటి వద్దకు తెచ్చి ఇచ్చినప్పటికీ ఎక్కువ రుసుము వసూలు చేయరని మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉంటుందని కూడా పలువురు అధికారులు తెలిపారు.

Telugu Decidedsupply-Latest News - Telugu

అలాగే ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని పనులకు కూడా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.ఇందులో ముఖ్యంగా వ్యవసాయ పనులకు కూలీలు ప్రభుత్వ నిబంధనలు పాటించి వెళ్లవచ్చని కూడా తెలిపింది.కానీ అనవసర పరిస్థితుల్లో మాత్రం బయట సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube