మెగాస్టార్ చిరంజీవి, బాబీ మెగా154 లో మాస్ మహారాజా రవితేజ మెగా మాస్ ఎంట్రీ

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ మెగా154 మెగా ఫోర్స్‌తో మాస్ ఫోర్స్‌ కలసి మరింత క్రేజీయెస్ట్‌గా మారింది.మెగా154లో పవర్ ఫుల్, లెంగ్తీ రోల్ ప్లే చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యారు.మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు లోడ్ అవుతోంది.చిరంజీవి, రవితేజ మాస్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న మెగా మాస్ అభిమానులకు ఇది పండగ లాంటి వార్త.

 Raviteja Joins Hands With Chiranjeevi In Mega154 Shooting Details, Mass Maharaja-TeluguStop.com

చిరంజీవి, రవితేజ కలసి తెరపై సందడం చేయడం అభిమానులకు కన్నుల పండగ.

అనౌన్స్ మెంట్ వీడియోలో రవితేజ కారుపై సెట్‌లోకి రావడం, చిరంజీవిని విష్ చేయడం, తర్వాత ఎనర్జిటిక్ గా కారవాన్‌లోకి వెళ్ళడం అభిమానులని అలరించింది.”అన్నయ్యా” అని రవితేజ పిలవగానే, చిరు రిప్లైగా ” హాయ్ బ్రదర్, వెల్‌కమ్ ”అని రవితేజ చేయి అందుకొని కారవాన్‌లోకి ఆహ్వానించడం మెగా మాస్ మూమెంట్ గా నిలిచింది.చివర్లో దర్శకుడు బాబీ “మెగా మాస్ కాంబో ఎంటర్టైనర్” అంటూ మెగా మాస్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేశారు.

మాస్ తో పెట్టుకుంటే, శంకర్ దాదా ఎంబిబిఎస్ పాటలు మిక్స్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం వీడియోకి మరింత మాస్ ఎనర్జీని నింపింది.వీరిద్దరూ స్క్రీన్‌పై ఎలాంటి మాస్ మ్యాజిక్ ని చూపించబోతున్నారో ఈ వీడియోని చూస్తే అర్ధమౌతుంది.

ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న ఉత్సాహం రవితేజ ఎంట్రీతో రెట్టింపైయ్యింది.

మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ, రవితేజ, డాన్ శీను, బలుపు చిత్రాలకు రచయితగా పనిచేశారు.

పవర్ సినిమాతో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.తన ఫేవరేట్ స్టార్, ఫస్ట్ సినిమా హీరోతో ఒకే ప్రాజెక్ట్‌లో పనిచేయడం దర్శకుడికి కల నిజమైనట్లయింది.

ఈ సినిమాని ఇద్దరి అభిమానులకు పూనకాలు ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నాడు.

Telugu Bobby, Shruthi Hasan, Massmaharaja, Chiranjeevi, Mythri Makers-Movie

అన్ని కమర్షియల్ హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు, పలువురు ప్రముఖ నటీనటులు పనిచేస్తున్నారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు:

చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, తదితరులు.

సాంకేతిక విభాగం:

కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ), నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానే, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి, ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి, సిఈవో: చెర్రీ, కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి, పీఆర్వో: వంశీ-శేఖర్, పబ్లిసిటీ: బాబా సాయి కుమార్, మార్కెటింగ్: ఫస్ట్ షో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube