బస్సు ఎక్కడానికి ధోనితో డబ్బులేవట.. రూ. 600 కావాలంటూ పోస్ట్ వైరల్..

ప్రజెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడం సహజమైపోయింది.ఇంటర్నెట్ వాడకం భారతదేశంలో మరింతగా పెరగడంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ను చూడటానికి స్మార్ట్ ఫోన్ లను కొనేస్తున్నారు.

 Scammer Impersonating Ms Dhoni Asks For Rs 600 To Return Home By Bus Details, Ms-TeluguStop.com

అయితే ఈ కార్యక్రమంలో ఆన్లైన్ మోసాలకు కూడా సంబంధించి అనేక కేసులు ప్రతిరోజు మనం తెలుసుకునే ఉంటున్నాము.ఆన్లైన్లో మోసాలకు పాల్పడే వ్యక్తులు రోజుకు ఒక కొత్త ఐడియాతో అమాయకులను టార్గెట్ చేసి వారికి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని అందులోని డబ్బులను మాయం చేసేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఓ ఆన్లైన్ మోసగాడు ఏకంగా టీమిండియా దిగ్గజ ఆటగాడైన మహేంద్రసింగ్ ధోనిను( Mahendra Singh Dhoni ) వాడుకున్నాడు అంటే ఆలోచించండి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో.ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే…

Telugu Dhoni, Dhoni Scam, Message, Fraud, Msdhoni, Ranchi, Rs-Latest News - Telu

ఇంస్టాగ్రామ్ ( Instagram ) ఖాతా నుండి మహేంద్రసింగ్ ధోని మెసేజ్ పంపినట్లుగా ఓ వ్యక్తికి మెసేజ్ వచ్చిందట.ఆ మెసేజ్ లో మహేంద్రసింగ్ ధోని రాసినట్లుగా.నేను ఎంఎస్ ధోనిని.

నేను నా ప్రైవేటు అకౌంటు నుంచి మెసేజ్ చేస్తున్నానని., తాను రాంచి పట్టణంలో( Ranchi ) బయటకి వచ్చినప్పుడు పర్సు తీసుకురావడం మర్చిపోయానని ఫోన్ పే ద్వారా తనకి 600 రూపాయలు పంపిస్తే తాను రాంచి వెళ్లగానే తిరిగి డబ్బులు మీకు మళ్ళీ పంపిస్తా అంటూ అందులో ఉంది.

ఇకపోతే ఇది గ్రహించిన సదరు వ్యక్తి దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ పోస్టును సోషల్ మీడియాలో( Social Media ) షేర్ చేశాడు.ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.

సదరు మోసగాడు ధోని సెల్ఫీని సైతం ఉపయోగించడం గమనార్హం.ఇక ఈ మెసేజ్ సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ ఇలాంటి మోసాల పట్ల అలర్ట్ గా ఉండాలంటూ తెలియచేశాడు.

Telugu Dhoni, Dhoni Scam, Message, Fraud, Msdhoni, Ranchi, Rs-Latest News - Telu

దేశంలో చాలా చోట్ల ఉన్నతాధికారులు ఆన్లైన్ మోసాలు( Online Scams ) జరుగుతున్న నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు.ఇలా ఎవరైనా తెలియని వారు మీకు మెసేజ్లు చేస్తే మాత్రం ఒకటికి రెండుసార్లు వాటిని సంబంధించిన వ్యక్తులతో నేరుగా మాట్లాడి అది నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే పని పూర్తి చేసుకోవడం మంచిది.లేకపోతే ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube