ఎప్పుడైతే సినిమా థియేటర్స్ పరిధి దాటి ఓటిటి( OTT ) చేతుల్లోకి వెళ్లిపోయిందో అప్పుడే సినిమా తాలూకు పూర్తి స్వభావం కూడా మారిపోయింది.థియేటర్స్ లో నడిచిన నడవకపోయినా ప్రతి చిత్రాన్ని కూడా తీసుకెళ్లి ఓటిటి లో వేయడం అలవాటుగా మారిపోయింది.
కొన్ని సినిమాలు ఓటిటి కోసమే అన్నట్టుగా తీస్తున్నారు.ఇలాంటి పరిస్థితులలో ఏ భాషలో అయినా సినిమా చూసే అవకాశం ఉన్న కారణంగా ఎక్కువగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కి సబ్స్క్రైబ్ అవుతున్నారు జనాలు.
మరి ఏ భాషలో సినిమా వచ్చిన చూసే వెసులుబాటు ఉన్నప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం ఏముంది అనే మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది.ఏది ఏమైనా ఓటిటి లో పరభాష చిత్రాల హవా మరి ఎక్కువగా కనిపిస్తుంది.
ముఖ్యంగా మలయాళ సినిమాల( Malayalam Movies ) జోరు మరి ఎక్కువగా ఉంది.ఇప్పుడు పలు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో ఐదు మలయాళ సినిమాలు గట్టిగా ప్రాభవాన్ని చూపిస్తున్నాయి.అవేంటో ఒకసారి చూద్దాం.
కన్నూర్ స్క్వాడ్
డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న కన్నూర్ స్క్వాడ్ సినిమా( Kannur Squad ) గత ఏడాది విడుదల అయింది.ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు.అంతే కాదు మలయాళం లో వంద కోట్ల కలెక్షన్ సాధించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
జోజి
ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన జోజి చిత్రం( Joji ) 2021లో విడుదల అయింది.అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా విలియం షేక్స్పియర్ రచించినటువంటి ఒక నాటకం ఆధారంగా తరికెక్కింది.క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.
రోర్షాక్
మమ్ముట్టి నటించిన మరొక సినిమా రోర్షాక్.( Rorschach ) ఇది సైకలాజికల్ థ్రిల్లర్ బేస్ గా వచ్చింది.డిస్నీ హాట్ స్టార్ లోనే అందుబాటులో ఉండగా మమ్ముట్టి ( Mammootty ) నటించిన ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది.
వైరస్
2019లో విడుదల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో( Amazon Prime ) ప్రేక్షకులకు అందుబాటులో ఉండగా 2018లో కేరళను వణికించినటువంటి నిఫా వైరస్ మరియు దాని సంబంధించిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.మెడికల్ థిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో కుంచాకో బోబన్, టీవీనో థామస్,రేవతి వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు.2019లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.
గరుడన్
అమెజాన్ ప్రైమ్ లోనే ఉన్న మరొక మలయాళ చిత్రం గరుడన్.( Garudan ) ఇది కూడా క్రైమ్ థ్రిల్లర్.అరుణ వర్మ అనే దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా సురేష్ గోపి వంటి వారు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.