టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పై సీఎం జగన్ తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు పేరు చెబితే మోసాలు, దగా మాత్రమే గుర్తుకొస్తుందన్నారు.
పవన్ కల్యాణ్ అంటేనే వివాహ వ్యవస్థకు కళంకం, మాయని మచ్చ అన్న సీఎం జగన్ కారు మార్చినట్లు పవన్ భార్యాలను మారుస్తారని విమర్శలు గుప్పించారు.చంద్రబాబు, పవన్ 2014 లో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తామని దగా చేశారని మండిపడ్డారు.చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్న సీఎం జగన్( CM Jagan ) పొదుపు సంఘాల మహిళలకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బెల్టు షాపులు రద్దు చేస్తామని మోసం చేశారన్న సీఎం జగన్ ఎన్నికలకు రెండు నెలల ముందు పెన్షన్ పెంచారని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు( Chandrababu )కు బీసీలు గుర్తుకొస్తారని తెలిపారు.
గతంలో చంద్రబాబు బీసీలకు 140 వాగ్దానాలు ఇచ్చారన్న సీఎం జగన్ బీసీలకు చంద్రబాబు చేసింది మాత్రం శూన్యమని విమర్శించారు.