అలనాటి తార తెలుగు సినిమా నటి జమున.తను చదువుకునే సమయంలో నాటకాలపై ఎక్కువ ఆసక్తి చూపేది.దీని వల్లనే ఆమెకు సినిమాలలో అవకాశాలు వచ్చాయి.మంచి అందం, నటనతో గుర్తింపు దక్కించుకుంది.తన నటన ద్వారా అవార్డులను కూడా సొంతం చేసుకుంది.కాగా ఆమెకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు అందించిన టైటిల్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.
తెలుగు సినీ పరిశ్రమలో 1953 లో మొదటిసారిగా పుట్టిల్లు సినిమాతో పరిచయం అయింది.దాదాపు 51 పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.కాగా జమున అప్పటి స్టార్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను తన వ్యక్తిత్వ విషయంలో వాళ్ల ను బాయ్ కాట్ చేసింది.
వారితో ఇక సినిమాల్లో నటించనని తేల్చి చెప్పింది.కానీ మూడు సంవత్సరాల తర్వాత గుండమ్మ కథ కోసం వారిద్దరితో మళ్లీ నటించింది.
జమున ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరి గురించి కొన్ని విషయాలు తెలుపగా.జమునకు వాళ్లతో ఎక్కువగా మనస్పర్థలు వచ్చాయట.ఎన్టీఆర్ కు అందరు దండాలు పెడుతుంటారు.కానీ తనకు ఇలాంటివి నచ్చవని, ఏ రంగంలోనైనా సొంత వ్యక్తిత్వం, తమ పాత్ర సరిగ్గా ఉంచుకోవాలి లేదా ఇలాంటివి ఎదురవుతాయని తెలిపింది.
కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి తనను పొగరుబోతుదని, కాలు మీద కాలు వేసుకుంటుందని, సమయానికి రాదంటూ, ఒకవేళ ఆలస్యంగా వచ్చిన క్షమాపణ చెప్పదంటూ.వాళ్లు ఈ విధంగా టైటిల్స్ ను అందించారు.
దీంతో జమునకు వాళ్ళపై కోపం వచ్చి మళ్లీ వాళ్లతో సినిమాల్లో నటించనంటూ తేల్చి చెప్పేసింది.కానీ గుండమ్మ కథ సినిమా కోసం ఈ ముగ్గురిని చక్రపాణి, నాగిరెడ్డి లు ఒప్పించారని తెలిపింది.