సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు( Athadu ) చిత్రం కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా ఇప్పటికి ఆ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు.టీవీల్లో సినిమా వచ్చినప్పుడు మంచి రేటింగ్ నమోదు అవుతూనే ఉంది.
సినిమా లోని ప్రతి పాత్ర ని ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు.
నంద గోపాల్ పాత్ర లో మహేష్ బాబు మరియు పూరి పాత్ర లో త్రిష( Trisha ) చేసిన నటన కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.ఇక ఇతర పాత్రల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతం మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ సినిమా రూపొందిస్తున్నాడు.అందులో హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తోంది.తాజాగా ఒక ఫోటో లీక్ అయింది.
అందులో పూజ హెగ్డే ను చూస్తూ ఉంటే అతడు సినిమా లో పూరి పాత్ర లో నటించిన త్రిష ను చూసినట్లుగా అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.లంగా వోణీ లో పూజా హెగ్డే ని చూస్తూ ఉంటే అతడు మ్యాజిక్ రిపీట్ అవ్వబోతుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఈ ఫోటోలు వైరల్ అవుతూ అతడు సినిమా ను గుర్తు చేసుకుంటున్నారు.అతడు సీక్వెల్ అన్నట్లుగా ఈ సినిమా ను త్రివిక్రమ్ రూపొందిస్తున్నాడంటూ మొదట ప్రచారం జరిగింది.కానీ ఆ వార్తల్లో నిజం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది.పూజ హెగ్డే తో అతడు సినిమా ను గుర్తు చేస్తూ ఈ సినిమా ను సక్సెస్ చేసుకునే విధంగా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడేమో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా లో శ్రీ లీల కీలక పాత్ర లో నటించబోతోంది.ఆమె లుక్ ఎలా ఉంటుందో అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మొత్తానికి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.