సవాల్ చేసిన నెటిజన్‌కు బెస్ట్ రిప్లై ఇచ్చిన ఎలాన్ మస్క్.. అసలు విషయమేంటంటే..

ప్రముఖ పారిశ్రామిక వేత్త, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మస్క్ జీవితం కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

 Elon Musk Reply To Netizen Challenge To Buy Twitter Details, Challenge, Elan Mas-TeluguStop.com

అయితే మస్క్ కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కావడం లేదు.ప్రపంచాన్ని మార్చేందుకు అతను ప్రతిరంగంలోనూ అడుగు పెడుతున్నారు.ఇందులో భాగంగా ఇటీవలే రూ.3.32 లక్షల కోట్లు వెచ్చించి ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు.అయితే ఐదేళ్ల క్రితమే ట్విట్టర్ కొనుగోలు చేయాల్సిందిగా ఒక నెటిజన్ ఎలాన్ మస్క్ కి సవాల్ విసిరాడు.

అయితే ఇప్పుడు మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేయడం ద్వారా అతనికి బెస్ట్ రిప్లై ఇచ్చినట్లయింది.

వివరాల్లోకి వెళితే.

ట్విట్టర్ లో ఐదేళ్ల క్రితం అంటే 2017 లో భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు వంటి అంశాలపై ఒక ఒక చర్చ జరిగింది.ఈ చర్చలో భాగంగా మస్క్ ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ భావప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహిస్తుందని, ఐ లవ్ ట్విట్టర్ అంటూ ట్వీట్ చేశారు.“మీరు ట్విట్టర్ ను ప్రేమిస్తున్నారా అయితే మీరు దాన్ని తప్పకుండా కొనాల్సిందే” అని డేవ్ స్మిత్ అనే ఒక యూజర్ మస్క్ ట్వీట్ కింద రిప్లై ఇచ్చాడు.

దీంతో దాని ధర ఎంతో చెప్పు, కొనేస్తా అన్నట్టుగా మస్క్ రిప్లై ఇచ్చాడు.అయితే అప్పుడు అన్నమాట ప్రకారం ఇప్పుడు కొని చూపించాడు మస్క్.దీంతో డేవ్ స్మిత్ దీని గురించి ఒక ట్వీట్ పెట్టాడు.“నేనేదో సరదాగా అంటే నిజంగానే ట్విట్టర్ కొనేశారు మస్క్. నేను కొనాలని చెప్పడం, ఆయన కొనేయడం వంటి సంభాషణ ఇప్పుడు నాకు పదే పదే గుర్తుకొస్తోంది” అన్నట్టుగా డేవ్ స్మిత్ ఒక ట్వీట్ చేశాడు.ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube