నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఆయనను అభిమానించే అభిమానులు ఉన్నారు.తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్న కార్యకర్తలు, నాయకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాసినిమాకు మార్కెట్, రెమ్యునరేషన్ పెరిగేలా జాగ్రత్త పడుతున్నారు.
అయితే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ను బాల భరతుడిగా పరిచయం చేశారని ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ను కొంత కలుపుకునే ప్రయత్నం జరిగిందని భరద్వాజ్ అన్నారు.అయితే సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత దూరం పెరిగిందని ఆయన వెల్లడించారు.
బాలకృష్ణ కూతురు నిశ్చితార్థం సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన వాళ్లను లోపలికి రానివ్వలేదని జూనియర్ ఎన్టీఆర్ సఫోకేషన్ గా ఫీలై ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేశాడని ఆయన చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదగడం కోసం యుద్ధాలు చేశారని భరద్వాజ్ వెల్లడించారు.
బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కు తానున్నానని చెప్పారని భరద్వాజ్ అన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో లైఫ్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.మే 28వ తేదీన ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.
ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







