బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్( Pallavi prashant ) ఆస్తుల గురించి ఈ మధ్య కాలంలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.పల్లవి ప్రశాంత్ కు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వార్తల గురించి పల్లవి ప్రశాంత్ తల్లీదండ్రులు స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.మా గురించి పనికిరాని వార్తలను ప్రచారం చేస్తున్నారని పల్లవి ప్రశాంత్ తండ్రి అన్నారు.26 ఎకరాల పొలంతో పాటు పెద్ద బిల్డింగ్, నాలుగు కార్లు ఉన్నాయని చెబుతున్నారని పల్లవి ప్రశాంత్ తండ్రి పేర్కొన్నారు.నిజంగా అన్ని ఆస్తులు ఉంటే నా కొడుకు బిగ్ బాస్ షోకు వెళ్లాల్సిన అవసరం ఏముందని పల్లవి ప్రశాంత్ తండ్రి చెప్పుకొచ్చారు.
పల్లవి ప్రశాంత్ కు నాలుగు కార్లు నిజంగా ఉంటే పెద్ద ఉద్యోగం చేసుకునేవాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
పల్లవి ప్రశాంత్ కు 26 ఎకరాల ఆస్తి ఉందని ప్రచారం చేసేవాళ్లు ఆ ఆస్తి ఎక్కడ ఉందో కూడా చూపిస్తే బాగుంటుందని ప్రశాంత్ తండ్రి పేర్కొన్నారు.నాకు కేవలం ఆరున్నర ఎకరాల పొలం ఉందని ఆ పొలంలో ప్రశాంత్ వాటా కేవలం రెండెకరాలు మాత్రమేనని ప్రశాంత్ తండ్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులను( Farmers ) ఎప్పుడూ చిన్నచూపే చూస్తారని బిగ్ బాస్ హౌస్ లో నా కొడుకును చులకన చేసి మాట్లాడారని ఆయన తెలిపారు.
నా కొడుకు బిగ్ బాస్ షో( Bigg Boss )కు విజేతగా నిలిచి ఆ డబ్బులను పేద రైతుల కోసం ఖర్చు చేసినా అంతకు మించి సంతోషం ఉండదని పల్లవి ప్రశాంత్ తండ్రి చెప్పుకొచ్చారు.పొలాన్ని నమ్ముకున్న రైతులలో చాలామంది కళ్లముందే ప్రాణాలు విడిచారని రైతులు పడే కష్టాలు ఏంటో కళ్లారా చూసిన నాకు మాత్రమే తెలుసని పల్లవి ప్రశాంత్ తండ్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.