లండన్‌లో( London ) స్థిరపడిన భారత సంతతికి చెందిన రచయిత్రి చేతనా మారూ రచించిన తొలి నవల ‘Western Lane’ బుకర్ ప్రైజ్ 2023లో షార్ట్ లిస్ట్ అయ్యింది.కెన్యాలో జన్మించిన మారూ ఈ నవలను బ్రిటీష్ గుజరాతీ పరిసరాల ఇతివృత్తం నేపథ్యంలో రచించారు.
ఇందులో స్క్వాష్ క్రీడను సంక్లిష్టమైన మానవ భావోద్వేగాలకు రూపకంగా ఉపయోగించారు చేతనా.ఇది గోపి ( Gopi )అనే 11 ఏళ్ల బాలిక , ఆమె కుటుంబం చుట్టూ తిరుగుతుంది.
బుకర్ ప్రైజ్ 2023 జడ్జింగ్ ప్యానెల్ చైర్, కెనడియన్ నవలా రచయిత ఈసీ ఎడుగ్యాన్ గురువారం లండన్‌లో షార్ట్ లిస్ట్‌ను ప్రకటించారు.చేతనా రచనను స్పోర్ట్స్ నవలగా పిలవడం సముచితంగా వుంటుందని ఎడుగ్యాన్ అన్నారు.
సారాబెర్న్ స్టెయిన్( Sarabern Stein ) ‘Study for Obedience’, జోనాథన్ ఎస్కోఫరీ రచించిన’If I Survive You’, పాల్ హోర్డింగ్ ‘The Other Eden’ , పాల్ లించ్ Prophet Song’ , పాల్ ముర్రే ‘The Bee Sting’లు బుకర్ ప్రైజ్ 2023కి షార్ట్ లిస్ట్ అయినట్లు జ్యూరీ ప్రకటించింది.నవంబర్ 26న లండన్‌లో జరిగే కార్యక్రమంలో విజేతకు అవార్డ్‌ను బహూకరించనున్నారు.అవార్డ్ కింద 50 వేల పౌండ్ల నగదును అందజేస్తారు.న్యాయ నిర్ణేతలు 13 లాంగ్ లిస్ట్ శీర్షికల నుంచి ఆరు నవలలను షార్ట్ లిస్ట్ చేశారు.గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య ప్రచురించబడిన 163 పుస్తకాల నుంచి ఎంపిక చేశారు.షార్ట్ లిస్ట్ కాబడిన రచయితలకు 2,500 పౌండ్ల బహుమతితో పాటు బెస్పోక్ బౌండ్ ఎడిషన్‌ను అందుకుంటారు.
తద్వారా ప్రపంచవ్యాప్తంగా సదరు పుస్తకం అమ్మకాల పెరుగుదలకు దోహదం చేస్తుంది.
ఇకపోతే.2023 ఏడాదికి గాను బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఫర్ గ్లోబల్ కల్చరల్ అండర్‌స్టాండింగ్ అవార్డుకు షార్ట్ లిస్ట్ అయిన వారిలో ఇద్దరు భారత సంతతి రచయితలు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.వీరిని యూకేకు చెందిన నందిని దాస్( Nandini Das ), యూఎస్‌కు చెందిన క్రిస్ మంజప్రాగా గుర్తించారు.
వీరితో సహా మొత్తం ఆరుగురు రచయితలు అవార్డ్‌కు షార్ట్ లిస్ట్ అయ్యారు.ఈ పురస్కారం కింద 25000 డాలర్లను అందజేస్తారు.భారత్‌లో జన్మించిన నందినీ దాస్ ‘‘’Courting India: England, Mughal India and the Origins of Empire’ పుస్తకానికి.కరేబియన్ దీవుల్లో జన్మించిన మంజప్రా ‘Black Ghost of Empire: The Long Death of Slavery and the Failure of Emancipation’ పుస్తకానికి బ్రిటీష్ అకాడమీ ప్రైజ్‌కు షార్ట్ లిస్ట్ అయ్యారు.