వైరల్: ఫ్రైడ్ ఐస్ క్రీం ఎప్పుడన్నా తిన్నారా? వెరైటీ రెసిపీ చూడండి!

అదేంటి, ఐస్ క్రీమ్( Ice cream ) గురించి విన్నాం కానీ, ఫ్రైడ్ ఐస్ క్రీం గురించి మేము ఎప్పుడూ వినలేదని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.ఇప్పుడొక వెరైటీ ఐసీ క్రీం ఐస్ క్రీమ్ ప్రియులను ఊరిస్తోంది.

 Viral Have You Ever Eaten Fried Ice Cream Check Out The Variety Recipe-TeluguStop.com

ఐస్ క్రీం అంటే మనందరికి తెలిసి చల్ల చల్లగా ఉండేదే.దానికి కొద్దిగా హీట్ తగిలినా కారిపోతుంది.

అలాంటిది ఐస్ క్రీంను ప్రైడ్ గా చేసి ఇస్తుంటే.ఆహారప్రియులు దానిని ఎంతో ఇష్టంగా ఆరగిస్తున్నారు.

ఫుడ్ వ్లాగర్ సలోని బోత్రా( Food vlogger Saloni Bothra ) ఈ అసాధారణమైన ట్రీట్‌ను సోషల్ మీడియా ద్వారా జనాలకి పంచుకున్నారు.దానిని నెటిజన్లు అవాక్కయి మరీ చూస్తున్నారు.

Telugu Fried, Latest-Latest News - Telugu

వైరల్ అవుతున్న ఈ వీడియోని ఒకసారి గమనిస్తే, గడ్డగా ఉన్న తియ్యని వెనీలా ఐస్ క్రీం( Vanilla ice cream ) ను తీసి ఓ గిన్నెలో వేసి, దాన్ని ఓ బాల్ లా చేయడం ఇక్కడ చూడవచ్చు.తరువాత దానిని బ్రెడ్ ముక్కల పొడిలో కలిపి, ఆ తర్వాత ఆ బాల్ ను నూనెలో వేయించారు.అలా దానిని గోధుమ రంగు వచ్చే వరకు ఉంచాడు.అనంతరం దాన్ని సర్వింగ్ బౌల్ లో వేస్తారు.ఆ తర్వాత దానిపై చాకోలెట్ క్రీమ్ ని పోయడం చూడవచ్చు ఈ వీడియోలో.అలా ఏర్పడ్డ మిశ్రమాన్ని స్పూన్ తీయడం అందర్నీ ఆకర్షిస్తోంది.

Telugu Fried, Latest-Latest News - Telugu

అయితే, ఈ వెరైటీ రెసిపీని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.“నేను దీన్ని ప్రయత్నించాను .ఇది చాలా రుచికరమైనది.అది చాలా బాగుంది” అంటూ ఓ యూజర్ కామెంట్ చేస్తే, “మాకు ఐస్ క్రీం అంటే ఎంతో ఇష్టం.

కానీ ఈ ఫ్రైడ్ ఐస్ క్రీం గురించి మేము ఎప్పుడూ వినలేదు.ఒకసారి మేము కూడా ట్రై చేస్తాం.” అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.కాగా ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకు 87వేల లైకులు, వెయ్యి కామెంట్స్, 96వేల షేర్స్ రావడం కొసమెరుపు.

ఇక వ్యూస్ అయితే లెక్కేలేదు.లక్షల సంఖ్యలో దీనిని చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube