స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే.తాజాగా సమంత వ్యక్తిగత జీవితం గురించి ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
సమంత తన పోస్ట్ లో ఒకవైపు నా హెల్త్ దెబ్బ తింటుంటే మరోవైపు నా వివాహ బంధం కూడా ముగిసిందని అన్నారు.అదే సమయంలో నేను నటించిన సినిమాలకు ప్రేక్షకాదరణ లభించలేదని ఆమె కామెంట్లు చేశారు.
ఈ విధంగా జరగడంతో ఎంతో బాధ పడ్డానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.గత రెండేళ్లుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యానని సామ్ కామెంట్లు చేశారు.ఆ సమయంలో నేను ఎంతోమంది నటీనటుల గురించి చదివానని సామ్ పేర్కొన్నారు.ఆ నటీనటుల ఆరోగ్య సమస్యలను ( Health problems )సైతం తెలుసుకున్నానని సామ్ చెప్పుకొచ్చారు.
వాళ్లు ట్రోల్స్ ను ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నానని సామ్ కామెంట్లు చేశారు.

వాళ్ల గురించి చదవడం నాకు ఎంతగానో సహాయపడిందని సామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చిందని సమంత తెలిపారు.అదే నాకు బలాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు.
ఒక నటిగా గుర్తింపు దక్కడం అందమైన బహుమతి అని సమంత కామెంట్లు చేశారు.నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో నేను నిజాయితీగా ఉంటానని సమంత తెలిపారు.

సినిమా సెలబ్రిటీల ( Celebrities )జీవితాలు అంటే ఫలితాలు, అవార్డులు వాళ్ల దుస్తులు మాత్రమే కాదని ఆమె అన్నారు.సినీ సెలబ్రిటీలకు సైతం కష్టాలు, బాధలు ఉంటాయని ఆమె వెల్లడించారు.నా ఒడిదొడుకులు అందరికీ తెలిసినందుకు బాధ పడనని నాలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారని సమంత తెలిపారు.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







