ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన పార్టీల చూపు ఇప్పుడు విశాఖపట్నం కేంద్రం గా ఉన్నట్లుగా తెలుస్తుంది .ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టి ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో జెండా పాతాలని మూడు ప్రధాన పార్టీలతో పాటు బిజెపి మరియు జెడి లక్ష్మీనారాయణ వంటి ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా తమ తమ ప్రయత్నాలను మొదలు పెట్టారు .
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖపట్నం పై ప్రత్యేక దృష్టి పెట్టిన వైసిపి దానిని పరిపాలన రాజధానిగా కూడా ప్రకటించి, త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం షిఫ్ట్ అయ్యి తన పరిపాలనను వారంలో మూడు రోజులు విశాఖ కేంద్రంగానే చేసుకోవాలని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.

గత ఉత్తరాంధ్ర ఎన్నికలలో 11 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ విశాఖ( Visakhapatnam ) పరిధిలోని నాలుగు సీట్లను ఓడిపోవడం ఆ పార్టీకి ఇప్పుడు అక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది .గత ఎన్నికలలో ఆ పార్టీ నుండి ఎంపి గా గేల్చిన ఎంవిపి ఇప్పుడు ఎంపీ గా పోటీకి సుముఖంగా లేకపోవడంతో ఎమ్మెల్సీ వంశీకృష్ణ( Vamsi Krishna Yadav ) యాదవ్ను ఎంపి లో నిలబెట్టాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది .యాదవ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకవుతుందన్నది వైసీపీ పార్టీ భావనగా తెలుస్తుంది.మరోవైపు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ చిన్నల్లుడుని గత ఎన్నికల్లో దింపింది , ఆయన ప్రభావవంతంగానే పోరాడినప్పటికీ జేడి లక్ష్మీనారాయణ ప్రభావంతో అతి తక్కువ ఓటు మార్జిన్తో ఆయన అక్కడ ఓడిపోయారు .తిరిగి ఈసారి కూడా ఆయననే నిలబెడితే సింపతీ వర్క్ అవుట్ అయ్యి గెలుపు సులువుతుందని అంచనాలతో టిడిపి ఉంది .

భాజపా కూడా ఈ సీటుపై గట్టిగానే పట్టుబడుతుంది ఇప్పటికి అక్కడ ఒకసారి గెలిచినా ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి( Daggubati Purandeswari ) మరొకసారి భాజపా అధ్యక్షురాలి హోదాలో అక్కడి నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇప్పటికే బీజేపీ నుంచి కేవీఎల్ ఆ సీటు పై కన్నేసి గత రెండు సంవత్సరాలుగా పరిచయాలను పెంచుకుంటూ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇప్పుడు పురందేశ్వరి రాకతో అక్కడ వర్గ పోరు మొదలైంది అంటున్నారు.జనసేన కూడా విశాఖ కేంద్రంగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది.ఇటీవలే గాజువాక నుంచి భారీ స్థాయిలో రీ సౌండ్ చేసిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వచ్చే ఎన్నికలలో శాఖ నుంచి మూడు సీట్లకు పైగానే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.
మరోవైపు గతంలో జనసేన నుంచి పోటీ చేసి ఇప్పుడు బయటకు వచ్చిన జెడి లక్ష్మీనారాయణ కూడా అప్పటి నుంచి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలతో మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు.అంతేకాకుండా వివిధ వర్గాల వ్యక్తులు ఇండిపెండెంట్ లుగా గా కూడా పోటీ చేయటం చేయడానికి చూస్తుండడంతో విశాఖ సీటు హాట్ కేక్లా మారిపోయినట్లుగాపరిణామాలు తెలియజేస్తున్నాయి
.






