పబ్లిక్ ప్రాసిక్యూటర్లను విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.2021లో 152 పీపీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా 132 మంది క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో 132 మందిలో 92 మందిని మాత్రమే పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా రిక్రూట్ చేశారు.క్వాలిఫై అయిన తమను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో 14 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం నాలుగు వారాల్లో 14 మందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.







