కల్పనా చావ్లాకు అమెరికన్ స్పేస్ కంపెనీ ఘన నివాళి: ఆమె పేరిట కార్గో స్పేస్‌ క్రాఫ్ట్‌

భారత సంతతి వ్యోమగామి, దివంగత కల్పనా చావ్లాకు అమెరికన్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ నార్త్రోప్ గ్రుమ్మన్ ఘన నివాళులర్పించింది.తమ తదుపరి సిగ్నస్ క్యాప్సూల్‌కు ‘ఎస్ఎస్ కల్పనా చావ్లా’’ అని పేరును పెడుతున్నట్లు ప్రకటించింది.

 Us Spacecraft Named After Late Indian-american Astronaut Kalpana Chawla, Us Spac-TeluguStop.com

భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లాకు ఇది తాము కల్పించిన గౌరవమని గ్రుమ్మన్ తెలిపింది.మానవ అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషికి గాను ఈ విధంగా నివాళులర్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

కొలంబియా నౌక ఆన్‌బోర్డులో ఆమె చేసిన చివరి పరిశోధన అంతరిక్ష ప్రయాణ సమయంలో వ్యోమగామి ఆరోగ్యం, భద్రతను అర్థం చేసుకోవడానికి తమకు సహాయపడిందని నార్త్రోప్ గ్రుమ్మన్ వెల్లడించింది.

గ్రుమ్మాన్ అంటేర‌స్ రాకెట్ ద్వారా ఎస్ఎస్ క‌ల్ప‌నా చావ్లాను నింగిలోకి పంప‌నున్న‌ది.

వ‌ర్జీనియాలోని వాలోప్స్ ఫ్ల‌యిట్ ఫెసిలిటీ సెంట‌ర్ నుంచి దీన్ని ప్ర‌యోగిస్తారు.రెండు రోజుల త‌ర్వాత అది అంత‌రిక్ష కేంద్రానికి అనుసంధానం అవుతుంది.

ఎన్‌జీ 14 మిష‌న్‌లో భాగ‌మైన ఎస్ఎస్ క‌ల్ప‌నా చావ్లా సుమారు 3630 కిలోల కార్గో మోసుకువెళ్తుంది.కాగా మాన‌వ అంత‌రిక్ష‌యాత్ర‌లో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌తి ఒక్క‌రి పేరును సిగ్న‌స్ క్యాప్సూల్‌కు పెట్ట‌డం నార్త్రోప్ కంపెనీ సాంప్ర‌దాయం.

Telugu Austronauts, Kalpana Chawla, Kalpanachawla, Spacecraft-Telugu NRI

కల్పనా చావ్లా భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో 1962 మార్చి 17న జన్మించారు.అక్కడి స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆమె.పైలట్ కావాలని కలలు కన్నారు.అనంతరం పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు.1982లో అమెరికాకు వెళ్లిన కల్పన.టెక్సాస్ యూనివర్సిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.కొలరాడో యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.1983లో జీన్-పియర్ హారిసన్ ను చావ్లా వివాహం చేసుకున్నారు.

కల్పనా చావ్లా “నాసా”కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు.అంతమందినీ పరిశీలించి… కల్పన సహా కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది.1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు.1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.2003లో ఆరుగురు సభ్యులతో అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న కొలంబియా నౌక కుప్పకూలడంతో కల్పనా చావ్లా మరణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube