ఏపీలోని కోనసీమ పేరు వినగానే పచ్చటి పొలాలు మన కళ్ల ముందు కదలాడతాయి.ఎటు చూసినా కొబ్బరి చెట్లు, అరటి తోటలు, వరి పైర్లు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
కోన సీమ కొబ్బరి బోండాలు అంటే ఇష్టపడని వారు ఉండరు.అక్కడి కొబ్బరి బోండాలకు, అరటి గెలలకు ఎంతో పేరుంది.
ఇటీవల కొన్నేళ్లలో ఆ ప్రాంతంలో బాగా అరటి గెలల పెంపకం చేపడుతున్నారు.వరి సాగు కంటే ఎక్కువ అరటి తోటలపైనే రైతులు మక్కువ చూపుతున్నారు.
లాభాలు కూడా ఇబ్బడి ముబ్బడిగానే వస్తుండడంతో సంతోషంగా ఉన్నారు.అయితే ఒక్కోసారి కొన్ని అరటి గెలలు ఆశ్చర్యపరుస్తుంటాయి.
పంట బాగా పండి అరటి గెలలు భారీ సైజులో దర్శనమిస్తుంటాయి.అలాంటి ఓ బాహుబలి అరటి గెల ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
సాధారణంగా అరటి గెలల్లో 80 నుంచి 300ల వరకు కాయలు ఉంటాయి.
అయితే కొన్నింటికి మరో వంద కాయలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది.అయితే కోనసీమలోని మలికిపురంలో ఓ వ్యక్తి ఇంట్లో బాహుబలి అరటిగెల కాసింది.ఏకంగా 80 హస్తాలతో పాటు 3 వేల కాయలు ఆ గెలకు ఉన్నాయి.ఇదంతా రిసార్టుకుల పర్యాటక కేంద్రమైన దిండి గ్రామంలో ముదునూరు ప్రసాదరాజు పొలంలో ఆ గెల ఉంది.
దానిని చూసేందుకు చాలా మంది అక్కడకు వస్తున్నారు.ఆ భారీ అరటి గెలతో ఫొటోలు దిగుతున్నారు.
అయితే ఇది భారతదేశంలో దొరికే రకం కాదని ప్రసాదరాజు చెప్పారు.దీనిని ప్రత్యేకంగా మలేషియా నుంచి రప్పించామని పేర్కొన్నారు.
దీనిని సింగపూర్ ఆల్మండ్ కర్పూర రకమని వెల్లడించారు.అక్కడి నుంచి పిలక రప్పించి, ఇక్కడ నాటినట్లు తెలిపారు.
ఈ భారీ గెలకు అరటి చెట్టు వంగి పడిపోకుండా గెడలు సాయంగా పెట్టినట్లు వివరించారు.