మునగాకు( Moringa ).దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
మునగ చెట్ల నుంచి వచ్చే కాయలే కాదు ఆకులతో కూడా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.మునగాకులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఫైబర్ తో సహా ఎన్నో విలువైన పోషకాలు మరియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అందుకే మునగాకు మూడు వందల జబ్బులకు చెక్ పెడుతుందని అంటుంటారు.ముఖ్యంగా మధుమేహులకు మునగాకు అండగా ఉంటుంది.
నిత్యం ఇప్పుడు చెప్పబోయే విధంగా మునగాకుని తీసుకుంటే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మునగాకు పొడి( Moringa Powder ) మార్కెట్లో ఇది మనకు మొరింగ పౌడర్ గా దొరుకుతుంది.లేదా ఇంట్లోనే మునగాకును ఎండబెట్టుకుని పొడిచేసి స్టోర్ చేసుకోండి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి వేసి మరిగించండి.దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు వాటర్ ను మరిగించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని కొద్దిగా తేనె కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ మొరింగ వాటర్( Moringa Water ) ను ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యపరంగా బోలెడు లాభాలు పొందవచ్చు.
ముఖ్యంగా మధుమేహులు ఈ వాటర్ ను నిత్యం తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.అలాగే ఈ మొరింగ వాటర్ ను డైట్ లో చేయించుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి.

క్యాన్సర్, గుండెపోటు వంటి జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.వెయిట్ లాస్ కు ఈ మొరింగ వాటర్ గ్రేట్ గా తోడ్పడుతుంది.అధిక బరువు సమస్య( Over Weight )తో బాధపడేవారు నిత్యం ఉదయం ఈ మొరింగ వాటర్ ను తాగితే చాలా వేగంగా వెయిట్ లాస్ అవుతారు.
అదే సమయంలో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.మరియు చర్మం పై మొటిమలు మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.స్కిన్ హెల్తీ గా మారుతుంది.







