రాఖీ సినిమాకు గుంటూరు కారం సినిమాకు ఉన్న ఈ పోలిక తెలిస్తే షాకవ్వాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( JR NTR ) కెరీర్ లోని హిట్లలో రాఖీ ( Rakhi movie )సినిమా ఒకటి.ఈ సినిమాలో తారక్ బొద్దుగా కనిపించినా కొన్ని సన్నివేశాల్లో తారక్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

 This Is The Similarity Between Rakhi And Gunturu Karam Details Here Goes Viral-TeluguStop.com

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సైతం అభిమానులకు ఎంతగానో నచ్చాయి.ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ బరువు తగ్గి కొత్త లుక్ లోకి మారారనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా గురించి తారక్ దగ్గర ప్రస్తావిస్తే ఈ సినిమాలో నటించింది తన అన్నయ్య అని సరదాగా చెబుతారు.

అయితే రాఖీ సినిమాకు హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అనే ట్యాగ్ లైన్ ఉంటుంది.అయితే గుంటూరు కారం( Guntur Kaaram movie ) అనే సినిమాకు కూడా ఇదే ట్యాగ్ లైన్ ను వాడారు.సాధారణంగా ఒక సినిమాకు వాడిన ట్యాగ్ లైన్ ను మరో సినిమాకు ఉపయోగించడం జరగదు.

అయితే గుంటూరు కారం, రాఖీ సినిమాలలో మాత్రం ఇది రిపీట్ అయింది.ఈ విషయంలో గుంటూరు కారం మేకర్స్ ను నిందించడం జరుగుతుందని చెప్పవచ్చు.

మరోవైపు గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.ఈ సినిమా అటు మహేష్ ( Mahesh babu )కు ఇటు త్రివిక్రమ్ కు కీలకం కాగా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది.పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుందని ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని చెప్పలేమని దర్శకులు చెబుతున్నారు.

అతడు, ఖలేజా సినిమాలలో మహేష్ ను క్లాస్ గా చూపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో హై వోల్టేజ్ మాస్ సీన్లకు ప్రాధాన్యత ఇచ్చారు.ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని సంక్రాంతికి మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube