పెళ్లి చేసుకుంటే జీవితం మీ చేతుల్లో ఉండదు.. పూరీ జగన్నాథ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు కాగా వేర్వేరు అంశాల గురించి పూరీ జగన్నాథ్ యూట్యూబ్ వేదికగా వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా పూరీ జగన్నాథ్ లైఫ్ ఇన్ కంట్రోల్ అనే అంశం గురించి వీడియో చేసి ఆ వీడియో ద్వారా వేర్వేరు విషయాలను వెల్లడించారు.

 Star Director Puri Jagannath Insteresting Comments About Marriage Life Details,-TeluguStop.com

పూరీ జగన్నాథ్ జీవితం మన చేతిలో ఉండదని మనం చెప్పినట్టు వినదని చెప్పుకొచ్చారు.జీవితాన్ని పట్టుకోవాలని అనుకుంటే జారిపోతుందని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

అయితే కొన్ని పనులు చేయడం ద్వారా లైఫ్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం సాధ్యం అవుతుందని రోజూ 60 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా 30 శాతం లైఫ్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.

మద్యం తక్కువగా తీసుకుంటూ మంచి డైట్ తీసుకుంటూ వ్యాయామం చేస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాదని పూరీ జగన్నాథ్ అభిప్రాయపడ్డారు.

ఏది రైటో ఏది రాంగో తెలిస్తే మన జీవితంలో సగం దరిద్రాలు పోతాయని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

Telugu Puri Jagannath, Tollywood-Movie

సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మరీ మంచిదని పూరీ జగన్నాథ్ సూచనలు చేశారు.ప్రతిభ, నిజాయితీ, క్యారెక్టర్ ద్వారా 80 శాతం కష్టాలకు దూరంగా ఉండవచ్చని పూరీ జగన్నాథ్ అన్నారు.మిగిలిన 20 శాతం లైఫ్ మాత్రం మన చేతుల్లో ఉండదని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.క్రమశిక్షణను కలిగి ఉన్నవాళ్లకు మాత్రం 80 శాతం లైఫ్ వాళ్ల చేతుల్లో ఉంటుందని పూరీ జగన్నాథ్ అభిప్రాయపడ్డారు.

Telugu Puri Jagannath, Tollywood-Movie

పెళ్లి జరిగితే మాత్రం 80 శాతం లైఫ్ మీ చేతులలో ఉండదని మీ ఆవిడ లేదా భర్త చేతిలో ఆ జీవితం ఉంటుందని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.మిగతా 20 శాతం లైఫ్ కూడా భర్త చేతిలో లేదా మీ ఆవిడ చేతిలో ఉంటుందని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube