నేడు సమాజం మనుషుల వక్రబుద్ది కారణంగా ఎన్నో కష్ట, నష్టాలు అనుభవిస్తున్న సంగతి గమనించే ఉంటారు.ప్రస్తుత కాలంలో మనిషికి కష్టాలు వస్తే అవి తీరుస్తాడని భగవంతుని దగ్గరకు వెళ్లుతాడు.
కానీ మానులా మారిన కొందరు మనుషులు మాత్రం భగవంతునికే భధ్రత లేకుండా చేస్తున్నారు.దేవుని గుడిలో దొంగతనాలు చేయడం, భగవంతుని భక్తులను హింసించడం వంటి మొదలైన పాప కార్యాలకు కారకులు అవుతున్నారు.
ఇదంతా మాయ వారిచే చేయిస్తుందనే విషయాన్ని విస్మరిస్తూ చేయకూడని తప్పులు చేస్తున్నారు.

ఇకపోతే కలియుగ వైకుంఠపురంగా పిలవబడే తిరుమలలో తాజాగా మరో కలకలం చెలరేగింది. శ్రీవారి మెట్టు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన శ్రీవారి నామం, రాతి శంఖుచక్రాలు మాయమయ్యాయట.కాగా కొండమీదికి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు శ్రీవారి నామం, రాతి శంఖు చక్రాలను పూజించి వెళ్లడం సర్వసాధారణమైంది.
అలాంటిది ఇవి చోరికి గురవడం భక్తులను విస్మయానికి గురిచేస్తుందట.