ఈ మార్పుల‌తో బెల్లీ ఫ్యాట్ మాయం..!

బెల్లీ ఫ్యాట్‌( Belly fat ).దీనినే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం అంటారు.

 Lose Belly Fat By These Changes! Belly Fat, Fat Cutter Tips, Health, Health Tips-TeluguStop.com

బెల్లీ ఫ్యాట్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.ప్ర‌ధానంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, శీతల పానీయాలు, జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ మరియు ఫైబర్ ను తక్కువగా తీసుకోవ‌డం, శారీరక వ్యాయామం లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, నిద్ర‌లేమి, జన్యుపరమైన కారణాలు, ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవ‌డం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, అధిక గ్లూకోజ్ లెవల్స్ త‌దిత‌ర అంశాల కార‌ణంగా పొట్టు చుట్టు కొవ్వు ఏర్ప‌డుతుంది.

అయితే చిన్న చిన్న మార్పుల ద్వారా ఈ కొవ్వును మాయం చేసుకోవ‌చ్చు.

Telugu Belly Fat Tips, Effective Tips, Fat Cutter Tips, Tips, Healthy Diet, Late

మొద‌ట ఆహారంపై దృషి పెట్టాలి.ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి.ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర, అధిక కొవ్వు( Processed foods, sugar, high fat ) ఉండే ఆహారాలను దూరం పెట్టండి.

భోజ‌నం చేసేట‌ప్పుడు టీవీ, ఫోన్ చూసే అల‌వాటు మానుకోండి.ఎందుకంటు, ఈ అల‌వాటు వ‌ల్ల ఎంత తింటున్నారో మీకే తెలియ‌దు.అలాగే ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ‌సార్లు తీసుకోవాలి.డైట్ లో గ్రీన్ టీ, జీల‌క‌ర్ర నీరు, అల్లం వెల్లుల్లి టీ, మెంతి నీరు, పుదీనా టీ, నిమ్మ నీరు వంటి పానీయాల‌ను చేర్చుకోండి.

ఇలా మెటబాలిజాన్ని మెరుగుపరచి కొవ్వు కరిగించడంలో చాలా అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.పైనాపిల్ జింజ‌ర్ స్మూతీ, కీరా పుదీనా స్మూతీ( Pineapple Ginger Smoothie, Peppermint Smoothie ), అవ‌కాడో కివీ స్మూతీ, స్పినాచ్ అండ్ గ్రీన్ టీ స్మూతీ వంటివి బెల్లీ ఫ్యాట్ ను మెల్ట్ చేయ‌డంతో తోడ్ప‌డ‌తాయి.

కాబ‌ట్టి ఈ స్మూతీల‌ను కూడా డైట్ లో చేర్చుకోండి.

Telugu Belly Fat Tips, Effective Tips, Fat Cutter Tips, Tips, Healthy Diet, Late

ఆ త‌ర్వాత వ్యాయామంపై ఫోక‌స్ పెట్టింది.బెల్లీ ఫ్యాట్ మాయం అవ్వాలంటే శ‌రీరక శ్ర‌మ అనేది చాలా అవ‌స‌రం.నడక, పరుగులు, సైక్లింగ్, స్విమ్మింగ్‌.

ఇవి పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడంలో ఉత్త‌మంగా తోడ్ప‌డ‌తాయి.రోజుకు అర‌గంట నుంచి 45 నిమిషాల వ్యాయామం చేయండి.

త‌ద‌నంత‌రం జీవ‌న‌శైలిలో మార్పులు చేర్చుకోవాలి.అందులో ముఖ్యంగా రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి.

ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు తీసేస్తుంది.అలాగే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఎంతో అవ‌స‌రం.

ఎందుకంటే నిద్రలేమి వల్ల శరీరంలో కొవ్వు చేరే అవకాశాలు ఎక్కువ.ఇక స్ట్రెస్ కు దూరంగా ఉండాలి.

ఒత్తిడి వల్ల కొవ్వు పెరగడానికి కారణమైన హార్మోన్ కార్టిసాల్ విడుదల అవుతుంది.సో.ఒత్తిడికి దూరంగా ఉండ‌టానికి యోగా, మెడిటేషన్ వంటివి చేయండి.పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడం కొంత సమయం పడుతుంది.

అందువ‌ల్ల క్రమంగా, శ్రద్ధగా ఈ మార్పులను పాటిస్తే మంచి ఫ‌లితాలు పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube