వైరల్ అవుతున్న ఓరియో బిస్కెట్ వీడియో.. ఆ బిస్కెట్ అంత డేంజరా?

సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని వీడియోలు తక్షణమే వైరల్ అవుతాయి.ముఖ్యంగా జంతువులతో సంబంధం ఉన్న వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి.

 Oreo Biscuit Video Going Viral.. Is That Biscuit That Dangerous?, Social Media,-TeluguStop.com

వాటి కంటే మరీ ఆసక్తికరమైన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి.ఈ నేపథ్యంలో, ఓరియో బిస్కెట్‌( Oreo biscuits) విషయంలో సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్న ఒక వీడియో గురించి చెప్పుకుంటే, ఇది నెట్టింటా పాకిపోయింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓరియో బిస్కెట్ వీడియోలో ఒక అద్భుతమైన ప్రయోగం జరిగింది.ఆ వీడియోలో ఓరియో బిస్కెట్‌ను ఎక్కువ సేపు కాల్చారు.

కానీ అది కాలిపోదు.దాదాపు 30 సెకండ్ల పాటు మంటల్లో ఉంచినా, బిస్కెట్ మాత్రం కాలిపోదు.

ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.ఓరియో బిస్కెట్ ఈ విధంగా కాలిపోకపోవడం అనేది చాలా మంది పట్ల విచిత్రంగా మారింది.

ఈ వీడియోతో పాటు, దానిపై ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి.ఈ బిస్కెట్‌ (Biscuits)తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏమిటి?, ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న ఓరియో బిస్కెట్‌ను తినడం మంచిదేనా? అనే ప్రశ్నలు అందరిని ఆలోచింప చేస్తున్నాయి.ఇకపోతే , ఓరియో బిస్కెట్ తయారీలో ముఖ్యంగా పాలతో తయారు చేస్తారు.దీనిలో చక్కెర, అన్ బ్లీచ్ (Sugar, unbleached)చేసిన పిండి (గోధుమ పిండి), నియాసిన్, ఐరన్, మోనో మోనిట్రేట్, తియమిన్, రైబోఫ్లెవిన్, కార్న్‌ ఆయిల్, సోయాబీన్ కోకోవా, కేనోలో ఆయిల్ వంటి పదార్థాలు ఉపయోగించి తయారు చేస్తారు.

ఇక, కార్న్ సిరప్, బేకింగ్ సోడా, ఉప్పు, సోయా లేసితిన్, చాకోలెట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కూడా ఇందులో వేసి ఈ బిస్కెట్లు తాయారు చేస్తారు.ఈ వీడియో వైరల్ కావడంతో కొంతమంది తాము తమ పిల్లలకు ఈ బిస్కెట్లు ఇవ్వడం లేదని కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube