అప్పు ఎగ్గొట్టకుండా ప్రామిస‌రీ నోట్ ఎలా రాసుకోవాలో తెలుసా?

అప్పులు ఇచ్చినా.తీసుకున్నా చాలా మంది ప్రామిసరీ నోటు రాసుకుంటారు.

 How To Write Promissory Note With Lending Person, Promissory Note, Revenue Stam-TeluguStop.com

డబ్బుల వసూళులో ఈ నోటు చాలా కీలక పాత్ర పోషిస్తుంది.అప్పులు ఇచ్చిన వారికి ఇదే ఆధారంగా ఉంటుంది.

అయితే ఈ ప్రామిసరీ నోటు అనేది చాలా పకడ్భందీగా రాసుకోవాల్సి ఉంటుంది.అందులోని కొన్ని అంశాలను తప్పకుండా రాయాల్సి ఉంటుంది.

అలా రాయకపోతే ఆ ప్రామిసరీ నోటు పనికిరాకుండా పోతుంది.ఇంతకీ ప్రామిసరీ నోటు ఎలా రాసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

*సాధారణంగా ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు.అప్పు తీసుకున్న వ్యక్తిగానీ, లేదంటే అప్పు ఇచ్చిన వ్యక్తి సూచించిన పర్సన్ గాని తీసుకున్న అప్పుకు సంబంధించి డబ్బులు చెల్లిస్తాను అనే అంశాన్ని తప్పకుండా ప్రామిసరీ నోటులో రాయాలి.

*అప్పు ఇచ్చే వారితో పాటు తీసుకునే వారి వయసు కూడా 18 ఏండ్లు నిండాలి.లేందటే ఆ నోటుతో అంతగా ప్రయోజనం ఉండదు.

*పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు రాసుకున్న ప్రామిసరీ నోటుకే విలువ ఉంటుంది.మతిస్థిమితం లేని వారు రాసుకున్న నోటుకు విలువ ఉండదు.

*ప్రామిసరీ నోటు రాససుకునే సమయంలో కచ్చింతగా ఇద్దరు ఇద్దరు సాక్షులు ఉండాలి.వారు ఈ నోటులో సంతకాలు కూడా చేయాలి.

Telugu Insane, Promissory, Stamp, Time Limit, Witnesses-Telugu Stop Exclusive To

*ప్రామిసరీ నోటుపై కచ్చితంగా రెవెన్యూ స్టాంప్ అంటించాలి.దాని విలువ 1 రూపాయి ఉంటే చాలు.ఆ స్టాంపుపై అడ్డంగా సంతకం తీసుకోవాలి.

*ప్రామిసరీ నోటు మూడేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది.

అంతకంటే ఎక్కువ సమయం అయితే దానికి విలువ ఉండదు.

*ఒక్కో ప్రామిసరీ నోటు మీద ససుమారు కోటి రూపాయల వరకు అప్పు ఇచ్చే అవకాశం ఉంది.

ఒక వేళ డబ్బు ఎగ్గొడితే ప్రామిసరీ నోటు బేస్ గా న్యాయ పరంగా ఆ డబ్బును రాబట్టుకునే అవకాశం ఉంటుంది.అయితే పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే సమయంలో లాయర్ సమక్షంలో ప్రామిసరీ నోటు రాసుకుంటే మున్ముందు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube