హీరోగా ఉండడం వేరు.అవసరానికి సరిపడా ఎక్స్ప్రెషన్స్ తో నటించడం వేరు.
కొంతమంది టాలీవుడ్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ మొహంలో పలకక పోయినా సరే స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.
కొంతమంది తమ సినిమాపై అలాగే కథపై గట్టి పట్టు ఉండడంతో అలా కానిచ్చేస్తున్నారు.మరి కొంతమంది సినిమాలు తామే నిర్మాతగా మారి నిర్మించుకుంటున్నారు కాబట్టి హీరోలుగా చూడాల్సి వస్తుంది.
ఇక కొంతమంది ఏ సినిమా తీసిన ఆడక వారి మొహంలో భావ భావాలు పలకక అలా నత్త నడకన కెరియర్ కొనసాగిస్తున్నారు.మరి ఎలాంటి హవా భావాలు పలకక పోయిన్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అడవి శేష్

అడవి శేషు( Adivi Sesh ) ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు.ఆయన నటిస్తున్న అన్ని సినిమాలు విజయం సాధిస్తున్నాయి.అలాగే సినిమాపై కథ పై మంచి పట్టు సాధించి తన చిత్రాన్ని ఎలాగోలా విజయం వైపు నడిపించే సత్తా ఉన్న హీరోగా అడవి శేషు ఉన్నాడు.కానీ అన్ని సీరియస్ కథలపై ఫోకస్ చేస్తున్న అడవి శేషు పలికించడంలో మాత్రం వెనకే ఉన్నాడు.ఆయన ఫేసులో సరిగా ఎక్స్ప్రెషన్స్ పలకవు.
నాగ చైతన్య

నాగ చైతన్య( Naga Chaitanya ) మొదటి సినిమాకి ఇప్పటికీ చాలా మారిపోయాడు.జోష్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్యని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.అసలు తాత తండ్రి వారసత్వం ఉన్న ఈ నటుడు మొహంలో ఒక్క హావభావం కూడా సరిగా పలకడం లేదు ఏంటి అంటూ విసుక్కున్నారు కూడా.స్లోగా తన మైనస్ పాయింట్స్ ని సరిదిద్దుకుంటూ వస్తున్నాడు నాగచైతన్య.
సుధీర్ బాబు

మహేష్ బాబు బావ కృష్ణ ఇంటి అల్లుడుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుధీర్ బాబు.( Sudheer Babu ) డబ్బా షేపులో ఉండే సుధీర్ బాబు మొహంలో కూడా అస్సలు ఎలాంటి హవ భావాలు సరిగ్గా పలకలేవు.అయినా కథ పై మంచి గ్రిప్ ఉండడంతో మంచి కథలను ఎంచుకుంటూ తొలినాళ్లలో పర్వాలేదనిపించినా ప్రస్తుతం అన్ని పరాజయాలే ఉన్నాయి అతని ఖాతాలో.మరి ముందు ముందు అయినా ఆయన సినిమాల లిస్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా చిరుత సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.( Ram Charan ) సోషల్ మీడియాలో రామ్ చరణ్ పై తొలినాల్లలో ఎలాంటి నెగెటివిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కానీ వజ్రం సాన పడితేనే బాగా మెరుస్తుంది అన్న విధంగా రంగస్థలం సినిమాతో తనలోని అనేక లోపాలను సరిదిద్దుకున్నాడు రామ్ చరణ్.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు.







