ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి( MLA Pinnelli ) సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఈవీఎం ధ్వంసం కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం పిన్నెల్లి రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు( Seshagiri Rao ) సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందని శేషగిరి రావు పిటిషన్ లో పేర్కొన్నారు.
అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఈ నెల 6వ తేదీన విచారణ జరిపి కేసును ముగించాలని సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.