బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha )కస్టడీ పొడిగింపుపై ఇవాళ విచారణ జరగనుంది.ఈ మేరకు కస్టడీ పొడిగింపు పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారణ చేపట్టనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియడంతో ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు.కాగా లిక్కర్ స్కాం కేసు( Liquor Scam Case )లో భాగంగా మార్చి 15న ఈడీ కవితను అదుపులోకి తీసుకోగా…మార్చి 26వ తేదీ నుంచి తీహార్ జైలులో ఉన్నారు.
కస్టడీ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం కస్టడీని ఇవాళ్టి వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.