ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy )పర్యటించారు.ఈ మేరకు నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అర్హులైన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇవ్వలేకపోయిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.రూ.22,500 కోట్లు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు.ఈ క్రమంలోనే పేదవారిని విస్మరించిన బీఆర్ఎస్( BRS) కు మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదని వెల్లడించారు.