ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.ఈ మేరకు ఈ నెల 7వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
కాగా ఈ నెల 7న ఎమ్మెల్సీ కవితపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.మరోవైపు ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను వచ్చే నెల 3వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించిందన్న సంగతి తెలిసిందే.
కాగా ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో సీబీఐ( CBI ) కీలక అంశాలను న్యాయస్థానం ఎదుట ఉంచింది.ఈ క్రమంలోనే రూ.1100 కోట్ల నేరం జరిగిందన్న ఈడీ రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని ఛార్జ్ షీట్ లో తెలిపింది.