ఏదైనా సినిమా తీస్తే అందులో ప్రతి సన్నివేశం ప్రజలకు ఎంతో కొంత రిలేట్ అయ్యే విధంగా తీస్తే తప్ప ఈ రోజుల్లో ప్రేక్షకులు ఆ సినిమాని ఒప్పుకునే పరిస్థితులు లేవు.సోషల్ మీడియా హడావిడి ఎక్కువైన తర్వాత ఏ చిన్న తప్పు చేసినా కూడా దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు.
అందుకే ఈ మధ్యకాలంలో సినిమాలు తీస్తున్న దర్శకులు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి పని చేయాల్సి వస్తుంది.అయినా కూడా కొన్ని అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన దర్శకులు తప్ప అలాంటి అద్భుతాలు మరెవ్వరూ రాయలేరు అన్న విధంగా ఉంటాయి.
అంత దారుణంగా తీసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డ సందర్భాలు ఉన్నాయి ఆ సినిమాలు ఏంటి ? ఆ సన్నివేశాలు ఏంటి ? ఆ దర్శకులు ఎవరు ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బాలకృష్ణ( Balakrishna ) ఏ సినిమా తీసిన అందులో ఏదో ఒక సోషల్ మీడియా ట్రోలింగ్ మూమెంట్ ఉంటుంది.ఎన్నో సీన్స్ అలా ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా తీసిన సందర్భాలు ఉన్నాయి.అన్ని విషయాలు పక్కన పెడితే తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడమే ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ఒక లాజిక్.
ఈ సీన్ పై మన టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా జోక్ చేస్తూ ఉంటారు.ఇక సరైనోడు( Sarrainodu ) సినిమా విషయానికొస్తే బోయపాటి( Boyapati ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మూడు రోజుల పాటు నిరంతరాయంగా పరిగెడుతూనే ఉంటుంది.
అలా పరిగెత్తి పరిగెత్తి చివరికి హీరో ఇంటికి చేరుకుంటుంది.

మరి అలా మూడు రోజులపాటు పరిగెత్తడానికి ఆమె ఏమైనా మనిషా లేక రోబోనా అనే విషయం మన డైరెక్టర్ బోయపాటే చెప్పాలి.పటాన్ సినిమాలో( Pathaan ) విలన్ జాన్ అబ్రహం సైతం ఇలాంటి ఒక వరస్ట్ మూమెంట్ ఉన్న సీన్ లో నటించారు.రెండు హెలికాప్టర్స్ ని ఒక తాడుతో దగ్గరికి లాగేస్తాడు.
దాన్ని చూసిన వారంతా ఒకటే నవ్వడం.గాలిపటాల కన్నా కూడా దారుణంగా రెండు హెలికాప్టర్లు మడతెయ్యడం ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి.
అనిమల్ సినిమాలో( Animal Movie ) కూడా రణబీర్ కపూర్ తన ఆరోగ్యం పూర్తిగా సెట్ అయిన తర్వాత పూర్తిగా న్యూడ్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు అక్కడే తన తల్లి కూడా ఉంటుంది.ఈ ఒక్క సీన్ సందీప్ రెడ్డి వంగా తీయకుండా ఉండి ఉంటే బాగుండేది.
ఇక రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలో కూడా రాష్ట్రాలకు రాష్ట్రాలు ట్రైన్ పై నిలబడి వెళ్లడం కూడా అప్పట్లో విపరీతంగా ట్రోల్ అయింది.







