ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్(exit polls) ను అనేక సంస్థలు విడుదల చేశాయి.అసలు ఎన్నికల ఫలితం జూన్ 4వ తేదీన తేలిపోనుంది.
అయితే అంతకుముందే తాము చేపట్టిన సర్వే నివేదికలను అనేక సంస్థలు బయటపెట్టాయి.కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉండగా, మరికొన్ని పార్టీల అంచనాలకు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.
ఈ ఫలితాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.దీనిపై రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి.
తాజాగా ఈ వ్యవహారాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prasanth Kishore) తాజాగా స్పందించారు. కొంతమంది చేపట్టే అనవసర రాజకీయ చర్చలు వింటూ సమయం వృధా చేసుకోవద్దని ప్రశాంత్ కిషోర్ ప్రజలకు సూచించారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పై సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు.
ఈసారి ఎప్పుడైనా ఎన్నికలు , రాజకీయాలపై చర్చలు జరుగుతుంటే బూటకపు జర్నలిస్టులు, నోరువేసుకు పడే రాజకీయ నాయకులు స్వయం ప్రకటిత సోషల్ మీడియా మేధావుల పనికిమాలిన విశ్లేషణాలపై మీ సమయం వృధా చేసుకోవద్దు ” అంటూ ప్రశాంత్ కిషోర్ (Prasanth Kishore)సలహా ఇచ్చారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బిజెపికి (BJP)300కు పైగా స్థానాలు దక్కుతాయని మొదటి నుంచి ప్రశాంత్ కిషోర్ చెబుతూనే ఉన్నారు.కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన అంచనాలు తలకిందులైన విషయాన్ని ఆ ఛానల్ యాంకర్ ప్రశ్నించగా, అతనికి ప్రశాంత్ కిషోర్ కు మధ్య వాగ్వాదం జరిగింది.ఈ నేపథ్యంలో నే తన ప్రత్యర్థులను సవాల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.” జూన్ 4 న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి ” అంటూ సెటైర్లు వేశారు.
ఇక తాజాగా ఏపీలో వెలువడబోయే ఎన్నికల ఫలితాలలో వైసీపీకి(YCP) ఎదురు దెబ్బ తప్పదని , ఎన్డీఏ కూటమి(NDA coalition) భారీగా సీట్లు వస్తాయి అని, ఏపీలో కూటమి అధికారం చేపడుతుందని ప్రశాంత్ కిషోర్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు.దీనిపై వైసీపీ అనేక విమర్శలు చేసింది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ లో ఏపీలో వైసీపీదే అధికారం అని అనేక ప్రైవేట్ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో ఉన్నాయి .అయినా ప్రశాంత్ కిషోర్ మాత్రం వైసిపి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని, కూటమి కే జనాలు అధికారం కట్టబెట్టబోతున్నారని ధీమా గా చెబుతున్నారు.