రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం( Vemulawada Rural Mandal) వెంకటంపల్లి గ్రామంలో ఆదివారం పిడుగుపాటుతో గేదె మృతి చెందింది.పేద కుటుంబానికి చెందిన పసునూరి పరశురాములు నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండేవాడు.
దానికి తోడు ఇటీవల ఒక గేదెను కొనుక్కొని జీవనం సాగిస్తున్న క్రమంలో పిడుగు పడి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవణాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు
.






