ఈజిప్ట్ వెళ్లిన బ్రిటిష్ జంటకు సోకిన డెడ్లీ వైరస్.. కట్ చేస్తే??

ఈజిప్ట్ వెకేషన్ ప్లాన్ చేసి ఎంజాయ్ చేయాలని అనుకున్న ఓ బ్రిటిష్ కపుల్‌కు(British couple ) చేదు అనుభవం ఎదురయింది.ఒలివియా హార్ట్లీ (Olivia Hartley)అని పిలిచే బ్రిటిష్ మహిళ ఇటీవల తన ఫియాన్సే థామస్ విన్‌తో కలిసి ఈజిప్ట్‌లోని హుర్గాడాకి ఈజీజెట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకుని సెలవులకు వెళ్ళారు.ఈ ప్రయాణం ఖర్చు 1,400 పౌండ్లు (రూ.1,48,904).2023, సెప్టెంబర్‌లో ఈ వెకేషన్‌ను చేపట్టారు.హాలిడే ముగింపులో, ఇద్దరూ అనారోగ్యానికి గురయ్యారు.

 The Deadly Virus That Infected The British Couple Who Went To Egypt, British Tra-TeluguStop.com

థామస్ (Thomas)విమానంలో తిరిగి వెళ్ళేటప్పుడు తీవ్రమైన వాంతులు అయ్యాయి, ఒలివియా ఇంటికి చేరుకున్న 48 గంటల తర్వాత అనారోగ్య లక్షణాలు ప్రారంభమయ్యాయి.

ఒలివియా ఆరోగ్యం బాగా దెబ్బతింది 3 రోజులుగా ఆమె ఏమీ తినలేకపోయింది, తాగలేకపోయింది.

తీవ్రమైన డీహైడ్రేషన్ (Dehydration)కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.ఆమె కాలేయం, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదని డాక్టర్లు గుర్తించారు, వెంటనే వైద్య చికిత్స అవసరం.

అనారోగ్యానికి కారణం ఏంటంటే వారు ఉండిన హోటల్‌లో ఆహార పరిశుభ్రత లోపం ఉండేది.ఆహారం తాజాగా లేదని, భోజన ప్రాంతంలో పక్షులు తిరుగుతున్నాయని ఒలివియా గమనించింది.

వారి బస చివరి రోజున ఆమె, థామస్ ఇద్దరూ అనారోగ్యానికి గురయ్యారు.ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒలివియా (Olivia)పరిస్థితి మరింత దిగజారి, నిరంతర వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది.

Telugu Deadly, Easyjet, Hurghada, Nri, Thomas Winn, Egypt-Telugu NRI

ఆసుపత్రిలో, ఒలివియాకు హెపటైటిస్ A ఉన్నట్లు వైద్యులు అనుమానించారు.ఇది కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపించే కాలేయ సంక్రమణం.ఒక డెడ్లీ వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది.హోటల్‌లో ఆహారం నుంచి ఈ వ్యాధి సోకిందని ఒలివియా నమ్మింది.ఆమె పరిస్థితి గురించి వైద్యులు ఆందోళన చెందారు.ఆమె కండిషన్ ఇంప్రూవ్ కాకపోతే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావచ్చని చెప్పారు.

Telugu Deadly, Easyjet, Hurghada, Nri, Thomas Winn, Egypt-Telugu NRI

అదృష్టవశాత్తూ, ఒలివియా ఆరోగ్యం మెరుగుపడింది, కానీ ఆమె ఇప్పటికీ ఆ వ్యాధి ప్రభావాలతో బాధపడుతోంది.కీళ్ల నొప్పులు, అలసట అనుభవిస్తుంది.కాలేయ సమస్యలు హఠాత్తుగా మరింత దిగజారే అవకాశం ఉందని డాక్టర్లు ఆమెను హెచ్చరించారు.ఈ ప్రమాదం గురించి ఒలివియా గుర్తుపెట్టుకుంది, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా మానసికంగా సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube