జగన్ పై టీడీపీ ఫైర్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన అచ్చెన్న

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) టిడిపి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది.ఒకపక్క ఎన్నికల కౌంటింగ్ హడావుడి జరుగుతుండగానే, మరోవైపు ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ కాంట్రాక్టర్లకు బిల్లును నిమిత్తం ఖర్చు పెడుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి( Central Election Commission ) టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్న నాయుడు( Kinjarapu Atchannaidu ) లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

 Kinjarapu Atchannaidu Letter Against Cm Jagan To Central Election Commission Det-TeluguStop.com

తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం   ఇష్టానుసారంగా అప్పులు చేస్తోందని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15వ తేదీకే దాటేసిందని అచ్చన్న లేఖలో ఫిర్యాదు చేశారు ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం అప్పులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారు.

చేసిన అప్పులన్నీ బినామీ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

Telugu Achhenna, Ap, Central, Cm Jagan, Contractors, India, Tdpcomplaint, Ysrcp-

ఆర్బిఐ ప్రకటన ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్ల అప్పులకు దరఖాస్తు చేసిందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో  ఫిర్యాదు చేశారు.ముందు బిల్లులు చెల్లించాలన్న సి ఎఫ్ ఎం ఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు .ఇప్పుడు తెస్తున్న నాలుగు వేల కోట్ల అప్పులు సైతం కాంట్రాక్టర్లకు( Contractors ) చెల్లించాలని చూస్తున్నారు.జూన్ 4 ,2024న ఎన్నికల ఫలితాలు రాబోతున్నందున అధికారం కోల్పోతున్న ప్రభుత్వ భారీ మొత్తంలో అప్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని అచ్చెన్న ఫిర్యాదు చేశారు.

Telugu Achhenna, Ap, Central, Cm Jagan, Contractors, India, Tdpcomplaint, Ysrcp-

వెంటనే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎటువంటి అప్పులు చెల్లింపులు చేయకుండా అడ్డుకోవాలని అచ్చెన్న లేఖ ద్వారా కోరారు.ఇష్టానుసారంగా అప్పులు చేసేందుకు సహకరిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారుల పైన వెంటనే విచారణ చేపట్టాలని ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో అచ్చెన్న ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube