హష్ మనీ ట్రయల్‌లో( Hush Money Trial ) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) న్యూయార్క్ కోర్ట్ దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.అతి త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఈ తీర్పు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కోర్టు నిర్ణయాన్ని డెమొక్రాట్లు స్వాగతిస్తూ ఉండగా.ట్రంప్ మద్ధతుదారులు, రిపబ్లికన్ నేతలు మాత్రం మండిపడుతున్నారు.
అయితే ట్రంప్‌ను దోషిగా తేల్చడాన్ని ఆయన మద్ధతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.దీనిలో భాగంగా అల్లర్లు, సామూహిక హత్య బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రైట్ వింగ్ సోషల్ నెట్‌వర్క్ గ్రూపులలో ట్రంప్ మద్ధతుదారులు( Trump Supporters ) మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.కొన్ని పోస్టులలో కోడ్ భాషను ఉపయోగించారు.ఉదాహరణకు వాటిలో ఒకదానిలో ‘‘ షార్ట్ డ్రాప్స్ ’’కు( Short Drops ) వారు పిలుపునిచ్చారు.అంటే ట్రంప్ విచారణను పర్యవేక్షిస్తున్న వ్యక్తులను ఉరితీయమనే అర్ధాన్ని ఇది సూచిస్తోంది.
మరో యూజర్ .హెలికాఫ్టర్ ఎమోజీతో పాటు చిన్న నడకదారులు, పొడవైన చుక్కలను సూచించే పదబంధాలను పేర్కొన్నాడు.బహుశా అవి ‘‘డెత్ ఫ్లైట్’’లు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చిలీ, అర్జెంటీనాలలోని రైట్ వింగ్ నాయకులు తమ ప్రత్యర్ధులను ఉరితీయమని చెప్పడానికి ఆ పదాలను ఉపయోగిస్తారు.

ఎంఏజీఏ (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ) మద్ధతుదారులు ట్రంప్‌పై నేరారోపణ సరికాదని, దేశ రాజకీయ, న్యాయ వ్యవస్ధలలో ఇది అవినీతిని సూచిస్తుందని వ్యాఖ్యానించారు.ఒక మిలియన్ మంది సాయుధులైన పురుషులు వాషింగ్టన్‌కు వెళ్లి అందరినీ ఉరితీయాలి.అదే పరిష్కారమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రయల్ జడ్చి మర్చన్, ప్రాసిక్యూటర్ మాథ్యూ కొలాంజెలో, మన్‌హట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్‌ల వృత్తిపరమైన జీవితాలను చట్టబద్ధంగా నాశనం చేయాలని ట్రంప్ మద్ధతుదారులను కొందరు సోషల్ మీడియా ద్వారా కోరారు.
వచ్చే నెలలో ట్రంప్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా సంస్థలు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది.