వైరల్ వీడియో: రోహిత్ అభిమానిని చితకబాదిన అమెరికా పోలీసులు..

నేడు ఆదివారం అమెరికా వేదికన టి20 ప్రపంచ కప్ 2024 ( T20 World Cup 2024 )మొదటి మ్యాచ్ ప్రారంభం అయ్యింది.ఈ మ్యాచ్లో కెనడా, అమెరికా( Canada, America ) జట్లు తలపడగా అమెరికా మొదటి విజయాన్ని అందుకుంది.

 Rohit's Fan Crushed By American Police In Viral Video, The Fan ,viral Latest,vir-TeluguStop.com

ఈ నేపథ్యంలో శనివారం నాడు జరిగిన భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్స్ కళ్లు కప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకెళ్లిపోయాడు.

ఆ అభిమాని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి అతనిని హాగ్ చేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.అయితే అంతలోనే అప్రమత్తమైన అమెరికా పోలీసులు మైదానంలోకి దూసుకొచ్చి నేలపై పడుకోబెట్టి బాగా కొట్టేశారు.

ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ( Captain Rohit Sharma ) అతనిని కొట్టవద్దని చెబుతున్న అమెరికా పోలీసులు ఏమాత్రం వినిపించుకోకుండా అతడిని చావబాదారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ సంఘటనలో చివరకు వచ్చి రోహిత్ శర్మ రిక్వెస్ట్ ను పోలీసులకు తెలపగా.వారు అతనిని పైకి లేపి మైదానం బయటకి తీసుకువెళ్లిపోయారు.అయితే ఈ సమయంలో అభిమానిని కాపాడేందుకు రోహిత్ శర్మ చేసిన ప్రయత్నం అందరిని ఇప్పుడు ఆకర్షిస్తుంది.దీంతో సోషల్ మీడియాలో రోహిత్ శర్మ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో బాగుందా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేయగలిగింది.ఇందులో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.183 పరుగుల భారీ లక్ష్యంతో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ టీం మొదట్లోనే పది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది.చివరకు 121 పరుగులు మాత్రమే చేయడంతో టీమిండియా జట్టు 61 ఒక్క పరుగులతో విజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube