తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా కొనసాగుతున్నటువంటి రాజమౌళి ( Rajamouli ) బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డును కూడా సాధించారు.
ఇలా ఈ సినిమాకు ఆస్కార్ రావడంతో రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుంది.
ఇలా ఈయనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా హాలీవుడ్ డైరెక్టర్లు టెక్నీషియన్లు కూడా ఈయనతో పనిచేయటానికి ఆసక్తి చూపుతున్నారు.ఇలా రాజమౌళికి ఏర్పడినటువంటి ఈ క్రేజ్ ను కొన్ని కంపెనీలు ఉపయోగించుకుంటూ తమ బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ అయినటువంటి ఒప్పో ( Oppo ) కోసం రాజమౌళి ఒక యాడ్ చేయడమే కాకుండా ఆ ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఒప్పో మొబైల్ ఫోన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి రాజమౌళి తాజాగా మరొక కొత్త యాడ్ షూట్ చేశారు.ఇక ఈ వీడియోలో ఒప్పో కంపెనీ ఇండియా ఫోటోగ్రఫీ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహిస్తుంది.దీనికి ఎవరైనా ఎంట్రీలు పంపొచ్చు.దీనికోసం ఓ యాడ్ చేసి అందులో ధైర్యం ఉంటే ఈ ఫొటోగ్రఫీ అవార్డ్స్ లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పాడు.దీనికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈ వీడియోలోనే వెల్లడించారు.ప్రస్తుతం ఈ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబు ( Mahesh Babu ) తో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు
.