తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad)తో పాటు ఖమ్మం, కరీంనగర్, వరంగల్(Khammam, Karimnagar, Warangal) జిల్లాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లలో (hotels ,restaurants)ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హోటల్ నిర్వహకులు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు.
కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు.అనంతరం నిబంధనలు పాటించని యాజమాన్యానికి నోటీసులు అందించారు.