తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబుకు( Mohan Babu ) ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు ఒకప్పుడు ఆయన విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషించి తనకు తానే సాటి అనిపించుకున్నాడు.కానీ ఇప్పుడు ఆయన మార్కెట్ మాత్రం పూర్తిగా తగ్గిపోయింది.
అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి ఏ దర్శక నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదు.అయితే మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ( Manchu Vishnu ) మాత్రం దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆయన ఖాతాలో సరైన సక్సెస్ అయితే పడలేదు.

దానితో 150 కోట్లు బడ్జెట్ తో ప్రస్తుతం కన్నప్ప( Kannappa Movie ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాతో తను మరోసారి పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ని అందుకొని ఇప్పుడున్న పాన్ ఇండియా హీరోలకి తను ఏమాత్రం తగ్గిపోలేదు అనే విధంగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.నిజానికి మంచు విష్ణుకు 15 కోట్ల మార్కెట్ కూడా లేదు మరి ఆయన ఎలాంటి ధైర్యంతో ఈ సినిమా మీద అన్ని కోట్ల డబ్బులను పెడుతున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటిస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే.

మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడు కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక మోహన్ బాబు పోషించే పాత్ర ఏంటి అంటే విష్ణు ఈ సినిమాలో కన్నప్ప పాత్ర చేస్తున్నాడు కాబట్టి తన గురువుగా తనను గైడ్ చేసే పాత్రలో మోహన్ బాబు నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇంకా చాలా రోజుల నుంచి మొహానికి మేకప్ వేసుకోకుండా ఖాళీగా ఉంటున్న మోహన్ బాబు ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
.