జబర్దస్త్ కమెడియన్ గా, నటిగా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి రీతూ చౌదరి (Ritu Chowdary) ఒకరు.ఈమె ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకుంటు ఉన్నారు.
అదే విధంగా దావత్ అనే కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా రీతూ చౌదరి రేవ్ పార్టీ(Rave party) గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి.

ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ ఇండస్ట్రీని ఎలా కుదిపేసిందో మనకు తెలిసిందే.ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలువురు వ్యక్తులు ఈ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ కూడా తీసుకున్నారని కర్ణాటక పోలీసులు తెలిపారు.ఇక ఈ పార్టీలో భాగంగా సినీనటి హేమ(Hema) కు పోలీసులు నోటీసులు కూడా అందజేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ విషయం గురించి రీతూ చౌదరి మాట్లాడుతూ.

గతంలో ఎవరైనా నన్ను రేవ్ పార్టీకి పిలిస్తే బాగుండేదని అనుకునేదాన్ని.రేవ్ పార్టీ అంటే అది కూడా అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేసే పార్టీ అనుకున్నాను.ఇప్పుడు రేవ్ పార్టీ గురించి అనుకుంటే భయం వేస్తుందని తెలిపారు.ఈ పార్టీ గురించి పూర్తి అవగాహన లేకపోయినా డ్రగ్స్ లాంటి వ్యవహారాలు వినిపిస్తున్నాయి.అలాంటి పార్టీలకు వెళ్లడం అవసరం లేదని ఫిక్స్ అయ్యా. రేవ్ పార్టీ అంటే చెడు వ్యవహారాలు ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.
ఒకవేళ ఇలాంటి పార్టీలకు వెళ్లి డ్రగ్స్ (Drugs) తీసుకుంటూ దొరికిపోతే మనల్ని మనం సమర్పించుకోలేము.ఒకవేళ సమర్థించుకున్న అది పూర్తిగా తప్పు అవుతుందని తెలిపారు.
అయినా సినిమా సెలబ్రిటీలో ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారో ఇప్పటికి అర్థం కాదని రీతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.