ఏపీ వ్యాప్తంగా రేపు డ్రైడే ఉండనుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రేపు 144 సెక్షన్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) తెలిపారు.
అదేవిధంగా ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతిని ఈసీ నిరాకరించిందని ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు.అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయన్న ఆయన కొన్ని జిల్లాలో ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా మద్యం దుకాణాలు మూసివేయబడతాయని స్పష్టం చేశారు.
పార్టీ కార్యాలయాలు, అభ్యర్థుల నివాసాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు పేర్కొన్నారు.కాగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఓట్(Parliament vote)ల లెక్కింపునకు మొత్తం 350 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.