మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ... లక్ అంటే ఈమెదే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి ( Rajamouli )!ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) తో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

 Janhvi Kapoor Play Key Role On Ssmb 29,janhvi Kapoor,mahesh Babu, Rajamouli, Tol-TeluguStop.com

ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా భారీ స్థాయిలో వర్క్ అవుట్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు.గత కొంతకాలంగా మహేష్ బాబు తన లుక్ కూడా పూర్తిగా మార్చేసిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Janhvi Kapoor, Janhvikapoor, Mahesh Babu, Rajamouli, Tollywood-Movie

మరి కొద్ది రోజులలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాని రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో కాకుండా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నహాలు చేస్తున్నారు.అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు .ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరూ నటించబోతున్నారు అనే విషయం గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Janhvi Kapoor, Janhvikapoor, Mahesh Babu, Rajamouli, Tollywood-Movie

ఈ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ నటి నటించబోతున్నారంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి  అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ బాలీవుడ్ బ్యూటీ అందుకున్నారని తెలుస్తోంది.లక్కీ బ్యూటీ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )ను హీరోయిన్ గా ఎంపిక చేశారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలి అంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే ఈమె రామ్ చరణ్ ( Ramcharan ) బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు కమిట్ అయ్యారు అలాగే ఎన్టీఆర్ ( NTR ) కొరటాల కాంబినేషన్లో రాబోతున్న దేవర సినిమాలో కూడా నటించారు ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రావటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube